Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ ప్రారంభమయ్యే 70 రోజులు పూర్తయింది. ఈ తరుణంలో దాదాపు గేమ్ చివరి దశకు చేరుకోవడంతో. ఇంకా 30 రోజుల ఆట మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో… ఎవరు టాప్ ఫైవ్ లో ఉంటారు..? ఎవరు టైటిల్ గెలుస్తారు అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. టైటిల్ రేసులో వినబడుతున్న పేర్లు సన్నీ(Sunny), షణ్ముక్(Shanmuk), యాంకర్ రవి(Ravi), శ్రీరామ్(Sri Ram). కాగా వీరిలో ఆట పరంగా అదే రీతిలో ఎంటర్టైన్మెంట్ పరంగా చూసుకుంటే… సన్నీ అందరికంటే ముందు వరుసలో ఉన్నారు.
ఇదిలా ఉంటే 11వ వారం లో సన్నీ ఆడిన ఆట తీరు బట్టి బయట.. వినబడుతున్నా టాక్ ప్రకారం.. సన్నీ మైండ్ నీ.. పూర్తిగా కాజల్(Kajal) కంట్రోల్ చేస్తున్నట్లు బయట జనాలు చెప్పుకొస్తున్నారు. కాజల్ చాలా కన్నింగ్ గా.. తనకు ఎగైనెస్ట్ గా ఉన్నా కంటెస్టెంట్ లపై… సన్నీని..ఉసిగొల్పి .. రివెంజ్ తీర్చుకుంటునట్లు చెప్పుకొస్తున్నారు. ఒక్కసారిగా సన్నీ దగ్గరికి వెళ్లి ఏడవటం… అదే రీతిలో సన్నీ మంచి కోపం మీద ఉన్న టైంలో మరింత రెచ్చగొట్టే రీతిలో… కాజల్ వ్యవహరిస్తుందని… ఏదో రోజు ఈ విధంగానే తన గేమ్ ఆడుతూ సన్నీకి కాజల్ డ్యామేజ్ చేయడం గ్యారెంటీ అని బయట జనాలు వీళ్ళిద్దరూ ఆటతీరుపై కామెంట్ చేస్తున్నారు.
కాజల్ తన స్వార్థం కోసం.. సన్నీ గేమ్ మొత్తం పాడు చేస్తుందని.. చెప్పుకొస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ పరంగా టాస్క్ పరంగా.. సన్నీ లో ఉండే ఫైర్… మిస్ఫైర్ అయ్యేలా కాజల్ అతని మైండ్ నీ… పూర్తిగా తన కంట్రోల్లో పెట్టుకునే రీతిలో కాజల్… సన్నీ మెంటల్ గా డిస్టర్బ్ చేస్తున్నట్లు బయట జనాలు 11వ వారం లో సన్నీ పట్ల కాజల్ వ్యవహరించిన తీరు చూసి కామెంట్ చేస్తున్నారు.