Bigg Boss Telugu 5: బిగ్ బాస్ (Bigg Boss)టైటిల్ రేసులో బాగా వినపడుతున్న పేరు సన్నీ. హౌస్ లో ఏడో వారం లో ఒన్ మ్యాన్ ఆర్మీ తరహాలో రెచ్చిపోయిన సన్నీ(Sunny)… కెప్టెన్ అయ్యి తనదైన శైలిలో హౌస్‌లో రాణిస్తున్నాడు. ఇతర కంటెస్టెంట్ ల పై నోరు పారేసుకోవడం.. మినహా మిగతా అంతా సన్నీ ఆడుతున్న గేమ్ పై.. బయట జనాలు నుండి మంచి పాజిటివ్ టాక్ నడుస్తోంది. ఫిజికల్ టాస్క్ లలో… ఇతర కంటెస్టెంట్ లను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ.. అప్పుడప్పుడు సన్నీ అట్టర్‌ఫ్లాప్ అయిపోతున్నా గాని.. కచ్చితంగా టాప్ ఫైవ్ లో మాత్రం నిలవటం గ్యారెంటీ అని జనాలు అంటున్నారు.
ఎంటర్టైన్మెంట్ పరంగా అదేరీతిలో ఫిజికల్ టాస్క్ లు… సన్నీ బాగా ఆడుతున్నాడని బయట జనాలు చెప్పుకుంటున్నారు. లోబో ఉన్నంతకాలం హౌస్ లో ఎంటర్టైన్మెంట్ ఉండగా అదే సమయంలో సన్నీ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు సన్నీ యే… మొత్తం ఎంటర్టైన్మెంట్ చేసే తరహాలో హౌస్ లో ప్రతి ఒక్కరితో క్లోజ్ గా ఉంటున్నాడని.., అతను ఆడుతున్న తాజా ఆటతీరుపై బయట జనాలు విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎనిమిదవ వారంలో జేస్సీ(Jessy), షణ్ముక్(Shanmukh)… ఇంకా చాలామంది కంటెస్టెంట్ లపై సన్నీ గొడవకు దిగడం జరిగింది.
సన్నీ ని కన్ ఫెక్షన్ రూమ్ కి
ఈ తరుణంలో నాగార్జున(Nagarjuna) వీకెండ్ ఎపిసోడ్ లో సన్నీ కి గట్టి వార్నింగ్ ఇచ్చారు. దాంతో సోమవారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ టైములో గతానికి భిన్నంగా సన్నీ.. చాలా తగ్గినట్లు కనిపించడం జరిగింది. ఇటువంటి తరుణంలో మంగళవారం ఎపిసోడ్ లో సన్నీ ని కన్ ఫెక్షన్ రూమ్ కి పిలిచి.. బిగ్ బాస్ మంచి బూస్ట్ అప్ ఇవ్వడం జరిగింది. సన్నీ మీరు హౌస్ లో మంచి ఆటతీరు కనబరుస్తున్నారు. మీరు మీ తప్పు లేనప్పుడు ఎక్కడ తగ్గాల్సిన అవసరం లేదు, గతంలో మాదిరిగా ఆడాలని సన్నీకి బిగ్ బాస్ సూచనలు ఇవ్వడం జరిగింది. దీంతో సన్నీ నీ బిగ్‌బాస్ తనని అభినందించడం పట్ల సంతోషం వ్యక్తం చేయడం జరిగిందని సరికొత్త వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.