NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీలో క‌క్క‌లేక మింగ‌లేక ‘ ఆనం ‘ .. చంద్ర‌బాబు మోసం దిగ‌మింగుకుని…!

ఆనం రామనారాయణరెడ్డి ఒకప్పుడు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత. అసలు ఆనం బ్రదర్స్ ఉండగా నెల్లూరు జిల్లా రాజకీయాలలో వాళ్లు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్టుగా ఉండేది. రెండున్నర దశాబ్దాల పాటు ఏక చక్రాధిపత్యంగా ఆనం సోదరులు నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసించారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలోనూ వీరి హ‌వా నడిచింది. 2014 ఎన్నికలలో ఆనం ఆత్మకూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినా ఆయనకు ఏకంగా 23 వేల ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత ఆనం సోదరులు ఇద్దరు టిడిపి కండువా కప్పుకున్నారు. అయితే ఆనం రామనారాయణరెడ్డి తనకు టిడిపిలో ఎమ్మెల్సీ తో పాటు చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్నారు.

ఆయన ఆశలు నెరవేరలేదు.. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ కండువా కప్పుకుని చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసి వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. వైసీపీలోనూ తనను అందలం ఎక్కిస్తారని.. కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని అనుకున్నారు. అయితే అక్కడ గెలిచిన యేడాదికే పరిస్థితి అర్థమయింది. తనకు ఏమాత్రం గౌరవం లేదని తెలుసుకున్నారు.. మంత్రి అనిల్ తో తీవ్రంగా విభేదించారు. అటు జగన్ దగ్గర కూడా ఆనం మాట ఏమాత్రం చెల్లుబాటు కాలేదు. కట్ చేస్తే ప్రక్షాళనలో ఆనంకు మంత్రి పదవి రాలేదు.

ఇక ఎన్నికలకు ఏడాది ముందే ఆనం టిడిపికి దగ్గరయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికలలోను విప్ ధిక్కరించి టిడిపి అభ్యర్థికి ఓటు వేశారు. అనంతరం వైసిపి ఆనంను పార్టీ నుంచి బహిష్కరించింది. టిడిపిలోకి వచ్చిన ఆనంకు ఇక్కడ కూడా పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. ఆనంకు తెలుగుదేశం ఆత్మకూరు సీటు కేటాయించింది. ఆయన నాకు వెంకటగిరి ముద్దు.. ఆత్మకూరు వద్దు అంటున్నారు. అయితే చంద్రబాబు వెంకటగిరి సీటును మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు లేదా ఆయ‌న కుమార్తెకు ఇస్తానంటున్నారు. ఆనంను కచ్చితంగా ఆత్మకూరులోనే పోటీ చేయాలని కండిషన్ పెట్టారు. అక్కడ పరిస్థితి అంత అనుకూలంగా లేకపోవడంతో ఆనం వెనుక ముందు ఆడుతున్నారు.

పోటీ చేస్తే ఆత్మకూరులో చేయాలి లేకపోతే తప్పుకోవాలి. దీంతో గతిలేక చంద్రబాబు వేసిన దెబ్బకు కక్కలేక మింగలేక ఎంతో ఆవేదనతో ఆత్మకూరు నుంచి పోటీ చేయడానికి ఏర్పాట్లు రెడీ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆత్మకూరులో ఇప్పటికీ మేకపాటి వాళ్ళ హవా నడుస్తోంది. ఒకప్పుడు ఆనం ఆత్మకూరు నుంచి గెలిచిన ఇప్పుడు ఆయన ప్రభావం అక్కడ పెద్దగా కనిపించడం లేదు. వైసిపి చాలా బలంగా ఉంది.. ఈ క్రమంలోనే తాను వెంకటగిరి నుంచి పోటీ చేస్తానని ఆనం పట్టుబడుతున్నా చంద్రబాబు ఆయనకు ఆత్మకూరు మినహా మరో సీటు ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. అందుకే ఆనంకు టిడిపిలో చేరిన ఎక్కడ కూడా ఎన్నికలకు ముందే ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా ఉంది.

author avatar
BSV Newsorbit Politics Desk

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju