వకీల్ సాబ్ విషయంలో దిల్ రాజు మైండ్ సెట్ ఏంటో పవర్ స్టార్ ఫ్యాన్స్ కి అర్థం కావటం లేదా..?

Share

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గాని బాక్సాఫీస్ స్టామినా గాని ప్రత్యేకంగా ఎవరు చెప్పాల్సిన పనిలేదన్న సంగతి తెలిసిందే. హిట్ అయినా ఫ్లాపయినా పవర్ స్టార్ కి ఉన్న ఇమేజ్ మాత్రం ఏమాత్రం తగ్గదు. ఇప్పటికే రాజకీయాలంటు సినిమాలు చేయక మూడేళ్ళవుతుంది. అయినా పవన్ కళ్యాణ్ గురించి .. ఆయన సినిమాల గురించి సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక వార్త హల్ ఛల్ చేస్తూనే ఉంటుంది.

Dil Raju Funding 1 Crore For Pawan Kalyan's Travel? | Gulte - Latest Andhra  Pradesh, Telangana Political and Movie News, Movie Reviews, Analysis, Photos

ఇక ప్రస్తుతం పవర్ స్టార్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా “వకీల్ సాబ్” పై కూడా భారీ అంచనాలు ఉన్నాయంటే పవన్ కళ్యాణ్ కి ఉన్న పాపులారిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. థియోటర్స్ లో పవర్ స్టార్ సినిమా చూసి జనాలు మూడేళ్ళు అవుతుండటంతో ప్రతీఒక్కరు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈపాటికే వకీల్ సాబ్ రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా కారణంగా రిలీజ్ కి బ్రేక్ పడింది. థియోటర్స్ ఎప్పుడు తెరుస్తారో తెలియకపోవడంతో వకీల్ సాబ్ రిలీజ్ విషయమై రక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి.

Vakeel Saab motion poster: Pawan Kalyan is armed with baseball bat and  criminal law | Entertainment News,The Indian Express

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా థియేటర్స్ తెరవని పరిస్థితి.. తెరిచినా జనాలు థియోటర్స్ కి వచ్చే అవకాశం ఉందా.. వసూళ్ళు వస్తాయా అన్నది ఇప్పుడు మేకర్స్ కి అర్థం కాకుండా ఉంది. ఈ కారణంగానే పలు చిత్రాలకు ఓటిటి సంస్థల నుంచి భారీ ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే “వకీల్ సాబ్” కు ప్పటి వరకు తెలుగులో ఏ సినిమాకు ఇవ్వని భారీ ఆఫర్ ను ఇచ్చారని సమాచారం. కాని నిర్మాత దిల్ రాజు ఆ ఆఫర్ ని ఇలా వదిలేశారని చెప్పుకుంటున్నారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దిల్ రాజుకు 100 కోట్లకు పైగానే ఆఫర్ ఇచ్చారట. అయినా పవన్ కళ్యాన్ సినిమా కాబట్టి ఆ ఆఫర్ ని వదిలేశారని ప్రచారం జరుగుతుంది. నిజంగా అంత భారీ ఆఫర్ వస్తే దిల్ రాజు వదిలేసి పొరపాటు చేసినట్టే అన్న టాక్ వినిపిస్తుంది. ఫ్యాన్స్ మాత్రం ఎలాగైనా వకీల్ సాబ్ ని చూడాలి అనుకుంటున్న్నారు. ఓటీటీలో రిలిజైనా సినిమా కి మంచి వసూళ్ళు దక్కడం ఖాయమన్న మాట వినిపిస్తుంది. కాని దిల్ రాజు మాత్రం ఈ విషయంలో చాలా మొండిగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన మైండ్ సెట్ ఏంటో అర్థం కావడం లేదని ఫ్యాన్స్ అంటున్నారట.


Share

Related posts

తిరుమ‌ల కొండ‌కు స‌మంత

Siva Prasad

Rang de : రంగ్ దే ఓటీటీలోనైనా హిట్ అవుతుందా..?

GRK

సాయి తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ ట్రైలర్ టాక్ ఏంటీ ఇలా ఉంది ..?

GRK