22.7 C
Hyderabad
March 24, 2023
NewsOrbit
న్యూస్

తన క్యాబినెట్ కూర్పు లో జగన్ కి మోస్ట్ ఫేవరెట్ మినిస్టర్ లు వీళ్ళే ! 

Share

వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక దాదాపు అన్ని సామాజిక వర్గాలకు పెద్దపీట వేస్తూ దాదాపు 25 మందికి మంత్రివర్గంలో చోటు ఇవ్వడం జరిగింది. సీనియర్ లు మరియు జూనియర్ లు అనే తేడా లేకుండా చాలా వరకు మంత్రి పదవులు పార్టీ లో గెలిచిన నాయకులకు జగన్ ఇవ్వడం జరిగింది. అత్యంత కీలకమైన పదవులను కూడా జూనియర్లకు జగన్ అప్పచెప్పటం అందరికీ షాక్ గురిచేసింది. ఈ విధంగా ఏర్పాటు అయిన జగన్ మంత్రి వర్గం పై ఆయా సామాజిక వర్గానికి చెందిన నాయకులు మరియు ప్రజలు కూడా మొదటిలో బాగానే అంచనాలు పెట్టుకున్నారు.

 

Pictures | AP CM YS Jagan Cabinet Meeting With Ministersకాగా మంత్రి వర్గంలోకి వచ్చి వీళ్లంతా ఇప్పుడు ఏడాది అయ్యింది. ఈ ఏడాది కాలంలో ఎవరు తమకు ఇచ్చిన మంత్రి పదవుల విషయంలో ఆయా శాఖకు ఎలాంటి న్యాయం చేశారు అన్న దాని విషయంలో ప్రజలలో మరియు మీడియా వర్గాలలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో మీడియా వర్గాల్లో వినబడుతున్న వార్తల ప్రకారం చాలావరకు మంత్రులు తమకు ఇచ్చిన పనులకు బదులు వైయస్ జగన్ ని పొగడటం పనిగా పెట్టుకుంటున్నారని ఎటువంటి ఫైలు కూడా కదిలే పరిస్థితి కనబడటం లేదు అంటూ ఆయా మంత్రుల దగ్గర పనిచేసే ఐఏఎస్ ఉన్నతస్థాయి లాంటి అధికారులు దగ్గర నుండి అందుతున్న సమాచారం.

 

కేవలం తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ మంత్రి అదేవిధంగా కృష్ణా జిల్లాకు చెందిన ఓ మంత్రి, ఈ ఇద్దరు మంత్రులు పనితీరు విషయంలో తప్ప మిగతా మంత్రుల విషయంలో జగన్ పెద్దగా సంతోషంగా లేరని సమాచారం. మరోపక్క తనపై బాగా పొగడ్తలు కురిపించే మంత్రుల విషయంలో జగన్ సరైన విధంగా లేనట్టు లోలోపల వైసీపీ పార్టీ లో వినపడుతున్న టాక్. ఏది ఏమైనా త్వరలో చాలావరకూ జగన్ మంత్రివర్గంలో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 

 

 

 

 

 

 

 


Share

Related posts

హైదరాబాద్ లోనే చంద్రబాబు..!!

sekhar

Nelatadi: ఈ మొక్క ఎక్కడ కనిపించినా వేర్లతో సహా తెచ్చుకోండి.. ఎందుకంటే..

bharani jella

టాలీవుడ్ లో మళ్లీ డ్రగ్స్ కలకలం..! ఓ సినీనటితో సహా విక్రయదారు అరెస్టు..!!

somaraju sharma