NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఇదేమన్నా inception సినిమా నా ? జగన్ – చంద్రబాబు ల ‘కలల’ కోరికలు !

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానులు దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఇదే క్రమంలో అమరావతి కాలగర్భంలో కలిసిపోనుంది. పేరుకి శాసన రాజధానిగా అమరావతిని ప్రకటించినప్పటికీ ఇక దాని గుర్తింపు రాష్ట్రంలో నామమాత్రంగానే ఉంటుంది అన్నది చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. మరీ ఇలాంటి సమయంలో జగన్ కన్న కల ఏమిటి…? బాబు చెడగొట్టుకున్న నా కథ…? ఏమిటి అసలు ఈ కలల గొడవేమిటి అనేది చూద్దాం…

 

ఈ ట్వీట్ ఏదో ఇన్సెప్షన్ సినిమాలా ఉందే…

ఏపీ 3 రాజధానులు పై వివాదం రోజు రోజుకీ ముదురుతున్న నేపథ్యంలో టీడీపీ ఎంపీ వేసిన ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “మన కలలు మనమే సాకారం చేసుకోవాలి మన కలలు ఎదుటి వారు సాకారం చేయాలని కోరుకోవడం అవివేకం అమరావతి @ncbn ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కన్న కల అది సాకారం అవ్వాలంటే 2024 లో @JaiTDP అధికారంలోకి రావాలి ఆ దిశగా పార్టీలో అందరూ పాటుపడాలి మీడియా సమావేశాల వల్ల పేపర్ స్టేట్మెంట్స్ వల్ల ప్రయోజనం లేదు,” అంటూ ఆయన ట్వీట్ చేశారు.

అవును మంత్రి గారూ… అసలు చంద్రబాబు కన్న అమరావతి అనే ఒక కలను ప్రజలు సహకారం చేయాలా…. లేదా బాబు ప్రజల కోసం చేయాలా..? ఈ ఒక్క విషయం క్లారిటీ ఇవ్వండి. లేకపోతే చంద్రబాబు జగన్ తీరుస్తాడని ఏమైనా ఆశలు పెట్టుకున్నాడా…? ఏదో సెంటిమెంటల్ గా ట్వీట్ చేయాలని తప్పించి ఆ విషయం ఎక్కడ ఉంది? అదేదో హాలీవుడ్ చిత్రం ‘ఇన్సెప్షన్’ లో టాప్ హీరో లియోనార్డో డికాప్రియో తన తోటి వారి కలలను సాకారం చేసేందుకు వారు ప్రపంచంలోని కి వెళ్లి అక్కడ విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాడు. అలాంటిది ఏమన్నా మన రాజకీయ నాయకులు దగ్గర్నుంచి ఆశిస్తున్నారా ఏంటి కొంపతీసి…?

మరి జగన్ కల విషయానికి వస్తే…

జగన్ కు ఉన్నది ఒకటే కల. తనపై ఉన్న అవినీతి మచ్చలను తుడిచి వేసుకుని దేశంలోనే బెస్ట్ సీఎం గా ఎదగాలని. నిన్ననే నిర్వహించిన ఒక సర్వే నిర్వహించిన పోల్ లో దేశంలోనే బెస్ట్ సీఎం గా మూడో స్థానంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిలిచారు. ఇంతకుమించి అతని నుంది పెద్ద పెద్ద ఆశలు, ఆశయాలు ఏమీ కనపడవు. కానీ జగన్ ఇదే క్రమంలో క్రమంలో 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. మరి అతని కల సాకారం చేయడానికి అమరావతి రైతులు తమ భూములను త్యాగం చేయడం కూడా సమంజసం కాదు. వారికి ఏదో ఒక రకంగా న్యాయం చేయకపోతే జగన్ కోసం ఒక ప్రాంతంలోని ప్రజలను, వారి భవిష్యత్తు తరాల తో పాటు తీవ్ర ఇబ్బందుల్లో పడేసినట్లే. ఈ విషయంలో కూడా జగన్ తన కలను నెరవేర్చుకుని… అవతలి వారికి న్యాయం చేకూరేలా వ్యవహరించాలని విశ్లేషకుల అభిప్రాయం.

వారికి కలలు ఉండవా…. వాళ్ళు మనుషులు కాదా?

ఇక జగన్ చంద్రబాబు వెర్షన్ ల కలల ప్రపంచం అయిపోతే…. అసలైన వెర్షన్ కి వద్దాం. అదే అమరావతి రైతుల వెర్షన్. వాళ్లంటే నాయకులు కలలు కనేందుకు వాటిని సాకారం చేసుకోవడానికి వారికి ఎన్నో అవకాశాలు, దారులు ఉంటాయి. మరి అమరావతి రైతులు విషయం ఏమిటి..? ఒక ముఖ్యమంత్రి వచ్చి మీ బతుకులు ఐదేళ్ళలో మారిపోతాయి అంటే గుడ్డిగా నమ్మి స్థలాలు, పొలాలు ఇచ్చేశారు. మరి ఇంకో ముఖ్యమంత్రి ఇప్పుడు వచ్చి మీ త్యాగానికి మీరు అనుకున్నంత విలువ లేదు అంటే వారు కన్న కలలు పెట్టుకున్న ఆశలు మొత్తం ఏమైపోవాలి అన్నది ప్రశ్న. నాయకుడు అనే వాడు తన పాలనతో ప్రజలకు కలలు కనగలిగే అవకాశాన్ని…. భరోసాని కల్పించి వారి కలలను సాకారం చేసుకోవడం లో తోడ్పడి ముందుండి నడిపించాలే గాని ఇలా తమ అవసరాల కోసం వారిని అన్యాయం చేయడం అనేది ఏమాత్రం సమంజసం కాదు.

ఇక ఇలాంటి సమయంలో ముఖ్యంగా చంద్రబాబు గురించి మనం మాట్లాడుకోవాలి. అమరావతి లాంటి తన అతి పెద్ద కలను బాబు తన ఐదేళ్ల పాలనలో సాకారం చేసుకునే ప్రయత్నం నిజాయితీగా చేసి ఉంటే జగన్ ఇంత సాహసం చేసి ఉండేవాడా? లేదా మూడు రాజధానులు అనే అంశం తెర మీదకు వచ్చి ఉండేదా..? ఏదో ఒక ఇరవై ఏళ్ళకు మన కలలు నెరవేర్చుకుందా…. అప్పటిదాకా ఈ అమరావతిని పట్టుకొని ప్రజలను ఆడుకుందాం అంటే…. కుదిరే పనేనా..? మరి చంద్రబాబు మొదలుపెట్టిన ఈ పొలిటికల్ గేమ్ ఆసాంతం ఆడేంత ఓపిక, పవర్, దమ్ము టీడీపీకి ఉన్నాయా అన్నది వేచి చూడాలి.

Related posts

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N