తెలుగు రాష్ట్రాల్లో మరో సారి ఆదాయపన్ను శాఖ (ఐటీ) సోదాలు కలకలం రేపాయి. హైదరాబాద్, విశాఖలలో ఇవేళ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని కోహినూర్ డెవలపర్స్, రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఐటీ సోదాలు నిర్వహిస్తొంది. ఆదాయ పన్ను చెల్లింపుల విషయంలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు రావడంతో ఇవేళ ఏకకాలంలో 20 బృందాలతో ఐటీ సోదాలు నిర్వహిస్తొంది. మాదన్నపేట, శాస్త్రీపురం, బంజారాహిల్స్, శంషాబాద్, అత్తాపూర్ సహా పలు ప్రాంతాల్లో ఐటీ తనిఖీలు నిర్వహిస్తొంది. రియల్ ఎస్టేట్, ఫార్మా, ఐన్ఫ్రా కంపెనీలపై ఐటీ దాడులు నిర్వహిస్తొంది.

సీఆర్పీఎఫ్ బలగాల సాయంతో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. కోహినూర్ కంపెనీ అవకతవకలకు పాల్పడినట్లుగా ఆరోపణలు రావడంతో అత్తాపూర్ కోహినూర్ క్లాసిక్ టవర్ లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏపిలోని విశాఖలోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. పలు ఫార్మా కంపెనీలు, వాటి డైరెక్టర్ల నివాసాల్లో సోదాలు నిర్వహిస్తొంది ఐటీ శాఖ. ఏకకాలంలో పదికిపైగా ప్రదేశాల్లో సోదాలు జరుగుతున్నాయి. విశాఖలో 15 ఐటీ బృందాలు సోదాల్లో పాల్గొన్నాయి.
Rahul Gandhi: సెక్యురిటీ లేకుండా రాహుల్ గాంధీ లారీలో ప్రయాణం ..ఎందుకంటే ..?