లంచ్ సమయానికి భారత్ స్కోరు 69/1

Share

ఆసీస్ లో నాలుగు టెస్టుల సిరస్ లో చివరిదైన సిడ్నీ టెస్ట్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రోహిత్ స్థానంలో జట్టులోకి వచ్చిన లోకేష్ రాహుల్ మరో సారి విఫలమై తొలి వికెట్ రూపంలో పెవిలియన్ కు చేరాడు.

అయితే మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్, వన్ డౌన్ లో వచ్చిన ఛటేశ్వర్ పుజారాలు సమయోచితంగా ఆడుతూ స్కోరు బోర్డును కదిలించారు.  లంచ్ విరామ సమయానికి భారత్ వికెట్ నష్టానికి 69 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ 42 పరుగులతోనూ, ఛటేశ్వర్ పుజారా 16 పరుగులతోనూ క్రీజ్ లో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హాజల్ వుడ్ ఒక వికెట్ తీసుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాతో సిరీస్ లో విజయం సాధించాలన్న భారత ఆకాంక్ష సాకారం అయ్యే అవకాశాలు ఈ సారి భారత్ కు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటి వరకూ ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై భారత్ ఒక్క సిరీస్ కూడా గెలవలేదు. అంతే కాదు చివరి టెస్ట్ కు వచ్చే సరికి ఆధిక్యంలో ఉండటం కూడా ఇదే తొలిసారి. నాలుగు టెస్టుల సిరీస్ లో భారత్ ఇఫ్పటికే 2-1 ఆదిక్యతతో ఉన్న సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ డ్రా అయినా సిరీస్ మనదే.


Share

Related posts

వామ్మో.. 65 ఏళ్ల మ‌హిళ 14 నెలల్లో 8 మందికి జ‌న్మ‌నిచ్చింద‌ట‌.. ఇలా కూడా స్కాం చేస్తారా..?

Srikanth A

ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి చేరుకున్న భారతీయులు

Siva Prasad

జ‌గ‌న్ చుట్టూ కుట్ర…. హైద‌రాబాద్ కేంద్రంగా రాజ‌కీయం?

sridhar

Leave a Comment