NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

భారత్ బాంబుల వర్షం: పాక్ ఉగ్ర శిబిరాలు ధ్వంసం


న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్ మధ్య గల నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి ఉన్న ఉగ్రవాద స్థావరాలపై భారత్ బాంబుల వర్షం కురిపించింది. మంగళవారం తెల్లవారుజామున 3.30గంటలకు ఈ దాడులు చేసింది. ఉగ్ర శిబిరాలపై భారత భద్రతా దళాలు దాడులు చేసిన విషయాన్ని ఆర్మీ అధికారులు ధృవీకరించారు.

12 మిరాజ్ 2000 భారత యుద్ధ విమానాలు ఎల్ఓసీ వెంట ఉన్న ఉగ్రస్థావరరాలపై దాడులకు దిగాయి. ఉగ్రవాద క్యాంపులపై 1000కిలోల బాంబులను వేసినట్లు ఐఏఎఫ్ వర్గాల ద్వారా తెలిసింది. ఈ దాడితో ఉగ్రవాద స్థావరాలు దాదాపు తుడిచిపెట్టుకుపోయినట్లు సమాచారం. బాలకోట్, ఛకోటి, ముజఫరాబాద్ ప్రాంతాల్లోని జైషే ఉగ్రవాద స్థావరాలను 100శాతం నాశనం చేసినట్లు భారత ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి.

భారత ఆర్మీ దాడుల విషయంపై ‘వావ్’ అంటూ జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ దాడి చిన్నదేం కాదు, ఇది నిజమైతే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం వేచిచూస్తున్నానని అన్నారు. యుద్ధ విమానాలు నడిపిన పైలెట్లకు సెల్యూట్ అంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

భారత యుద్ధ విమానాలు నియంత్రణ రేఖను దాటి బాలకోట్ వరకు చొచ్చుకొచ్చాయని ఇంతకుముందే పాకిస్థాన్ ఆరోపించింది. బహిరంగ ప్రదేశాల్లో పలుచోట్ల బాంబులు వేశాయని పేర్కొంది. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంక్వా ప్రాంతంలోని ఓ పట్టణమే బాలకోట్. ఇది ఎల్ఓసీకి 50కి.మీ దూరంలో ఉంటుంది. ఉగ్రవాద స్థావరాలపై భారత్ జరిపిన తాజా దాడులతో ఇరు దేశాల మధ్య ఉగ్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

2016లో యురి ఘటన తర్వాత పాక్ ఆక్రమిత ప్రాంతంలోకి చొచ్చుకెళ్లిన భారత భద్రతా దళాలు ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ సర్జికల్ స్ట్రైక్స్‌లో పదుల సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారు. ఇప్పుడు పుల్వామా దాడి నేపథ్యంలో మరోసారి భారత్ నియంత్రణ రేఖను దాడి ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేస్తోంది. ఫిబ్రవరి 14న జైషే ఉగ్రవాదుల జరిపిన ఆత్మాహుతి దాడిలో 40మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు.

తాజా పరిస్థితిపై కేబినెట్ భేటీ

ప్రధాని నరేంద్ర మోదీ తాజా పరిస్థితుల నేపథ్యంలో కీలక మంత్రులతో సమావేశమయ్యారు.  విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.  తాజా దాడుల నేపథ్యంలో భారత సరిహద్దు వెంబడి భారీగా భద్రతా బలగాలు మోహరించాయి.

author avatar
Siva Prasad

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Leave a Comment