ఆసీస్ 236/6

సిడ్నీ(ఆస్ర్టేలియా), జనవరి 5: ఆస్ర్టేలియా-భారత్ జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్టు మూడవ రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ ఆరు వికెట్లు కోల్పోయి

236 పరుగులు చేసింది. సిడ్ని వేదికగా జరుగుతున్న నాల్గవ టెస్టు మూడవరోజు  చివరల్లో భారీ వర్షంతోపాటు సరైన వెలుతురు లేని కారణంగా మ్యాచ్‌ను నిలిపివేశారు.

టీం ఇండియా బౌలర్లు విజృంభించడంతో ఆసీస్ బ్యాట్స్‌ మెన్ తడబడ్డారు. తొలి ఇన్నింగ్స్‌ లో ఆసీస్ ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో పాట్ కమిన్స్ 25 పరుగులతోనూ, హాండ్స్ కాంబ్ 28 పరుగులతోనూ ఉన్నారు. భారత బౌలర్లు కులదీప్ మూడు వికెట్లు, జడేజా రెండు, షమీ ఒక వికెట్ పడగొట్టారు.

ఆసీస్ జట్టు మూడవ రోజు  24 పరుగుల ఒవర్ నైట్ స్కోరుతో ఆట ప్రారంభం కాగానే ఓపెనర్  ఉస్మాన్ ఖవాజా(27)ను కులదీప్ ఔట్ చేశాడు. లంచ్ విరామం వరకు కుదురుగా ఆడిన ఆసీస్ జడేజా శతకం దిశగా దూసుకువెళుతున్న మార్కన్ హారిన్(79)ను ఔట్ చేశాడు.  కులదీప్ రాణించి ట్రావిన్ హెడ్, టిమ్ షైన్ వంటి కీలక వికెట్లను తీశాడు. కెప్టెన్ షైన్ (05)ను కులదీప్ క్లీన్‌ బౌల్డ్ చేశాడు. వర్షం కారణంగా మూడవ రోజు మ్యాచ్‌ను 84 ఓవర్లకే కుదించారు.

టీం ఇండియా ఆసీస్‌పై 386 పరుగుల ఆధిక్యంలో ఉంది.

SHARE