గబ్బా లో అబ్బా అనిపించిన పంత్, గిల్..! అద్భుతమైన విజయానికి చివర్లో భారత్…!

 328 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత క్రికెట్ జట్టు నాలుగవ టెస్టు 5వ రోజు ఆట ప్రారంభించిన విషయం తెలిసిందే. 1-1 తో నాలుగు టెస్ట్ మ్యాఛ్ ల సిరీస్ సమం గా ఉన్న సమయంలో భారత జట్టు చివరి రోజు 324 పరుగులు సాధిస్తే సిరీస్ కైవసం చేసుకుంటారు. 

 

కనీసం డ్రా చేసుకున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ భారత్ వద్దనే ఉంటుంది. ఇలాంటి సమయంలో ఆదిలోనే ఓపెనర్ రోహిత్ శర్మ పెవిలియన్ బాట పట్టాడు. అయితే మరొక యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్ అద్భుతమైన ఆటతీరుతో 91 పరుగులు సాధించి భారత్ విజయానికి గట్టి పునాది వేశాడు. ఒక ఎండలో చటేశ్వర్ పుజారా వికెట్లు పడకుండా నిలిపితే…. రహానే ఉన్న కొద్దిసేపు బ్యాట్ ఝలిపించాడు. 

ఆ తర్వాత వచ్చిన రిషభ్ పంత్ సమన్వయంతో ఆడుతూ స్కోరు బోర్డు ని ముందుకు కదిలించాడు. ప్రస్తుతం భారత్ విజయానికి 10 పరుగుల దూరంలో నిలిచింది. చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి… నాలుగు ఓవర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. పంత్ 80 పరుగులతో ఆడుతున్నాడు. ఇక విజయానికి చెరువులో టీమిండియా ఉంది అనే చెప్పాలి. అయితే ఇప్పుడే వాషింగ్టన్ సుందర్ ను లయన్ బౌల్డ్ చేశాడు.

చివరి నిమిషాల్లో బౌండరీలు రావడంతో పాటు పంత్ వేగంగా 1,2 పరుగులు తీస్తూ భారత్ కు మరిచిపోలేని విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అతనితో పాటు మొదటి ఇన్నింగ్స్ హీరో శార్దూల్ ఠాకూర్ క్రీజులో ఉన్నాడు. అందరి అంచనాల ప్రకారం మరో 10 నిమిషాల్లో భారత్ విజయాన్ని అందుకుంటుంది.