2022లో భారత్ లో జి 20 శిఖరాగ్రసభ

భారతదేశం తొలిసారిగా 2022లో జి- 20 శిఖరాగ్రసభకు ఆతిథ్యం ఇవ్వబోతోంది. భారత ప్రధాని నరేంద్రమోదీ ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రపంచంలో 20 అగ్రరాజ్యాల అధినేతలు పాల్గొనే సభే జి- 20. బ్యూనస్ ఏరీస్ లో రెండు రోజుల జి –20 సభ ముగింపు కార్యక్రమం సందర్భంగా ప్రధాని మోదీ ఈ ప్రకటన చేశారు. 2022లో ఇటలీలో ఈ అంతర్జాతీయ సభ జరుగుతుంది. భారతదేశం స్వాతంత్ర్యదేశంగా ఆవిర్భవించి 2022కు 75 ఏళ్లు అవుతాయి. భారత ఆవిర్భావ స్వర్ణోత్సవాల నేపథ్యంలో జి- 20 శిఖరాగ్ర సభ మనదేశంలో నిర్వహించడం గొప్ప విషయం. ప్రపంచంలో అత్యంత వేగంగా బలమైన ఆర్థిక శక్తిగా రూపొందుతున్న భారత్ లో ఈ సభ నిర్వహించేందుకు ఇటలీ అవకాశం ఇచ్చింది.జి.20 సభలకు 2022లో భారతదేశానికి రావల్సిందిగా ప్రధాని మోదీ ప్రపంచ దేశాల అధినేతలను ఆహ్వానించారు.
జ-20 లో ఆర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, యురోపియన్ యూనియన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, టర్కీ, బ్రిటన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దేశాలు ఉన్నాయి. ప్రపంచంలో మూడో వంతు జనాభా ఈదేశాల్లో ఉంటే, ప్రపంచ వాణిజ్యంలో 80 శాతం, ప్రపంచంలో జరిగే ఉత్పత్తులలో 90 శాతం ఈ దేశాలలోనే జరుగుతాయి.