NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఇకపై టోల్ గేట్ దగ్గర టోల్ ఫీజ్ కట్టక్కర్లేదు.. కేంద్రం..!

Share

నేషనల్ హైవేపై ప్రయాణించేటప్పుడు వాహనదారులు తప్పకుండా టోల్ గేట్ వద్ద ఆగి టోల్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే.. అయితే ఆ సమయంలో ఒక్కోసారి భారీగా ట్రాఫిక్ ఏర్పడుతూ ఉంటుంది. ఇక ఆ సమస్యను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్యాగ్ విధానాన్ని తీసుకొచ్చింది. ఇకపోతే ఈ విధానం ద్వారా వాహనదారులు ముందుగానే రీఛార్జి చేసుకొని ఉండడం వల్ల చెల్లింపులు కూడా త్వరగానే పూర్తవుతాయి దీనికోసం సమయం కూడా ఎక్కువగా ఆదా అవుతుంది.

toll gate

 

ఇకపోతే తాజాగా వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఇకనుంచి ఆ సమయం కూడా వెచ్చించాల్సిన పనిలేదని, కేంద్ర రవాణా శాఖ వెల్లడించింది. జాతీయ రహదారులపై వెళ్లే వాహనదారులు టోల్గేట్ వద్ద ఆగి ఫాస్ట్ ట్యాగ్ ద్వారానో లేక మామూలుగానో టోల్ ట్యాక్స్ చెల్లించే పనిలేదు. జాతీయ రహదారిపై టోల్ ట్యాక్స్ వసూలు చేసేందుకు జిపిఎస్ ఆధారిత వ్యవస్థను తీసుకురానున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇక ప్రస్తుతం ఉన్న టోల్ ప్లాజాల స్థానంలో జిపిఎస్ ఆధారిత వ్యవస్థను ఏర్పాటు చేస్తామని కేంద్రం ఉపరితల రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గట్కరి వెల్లడించారు.

దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు తీరడమే కాదు కేవలం వాహనదారులు ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్ ఫీజ్ వసూలు చేయబడుతుందని స్పష్టం చేశారు. టోల్గేట్ వద్ద వాహనాన్ని ఆపాల్సిన పని లేకుండా.. నంబర్ ప్లేట్ ఆధారంగా టోల్ ఫీజ్ వసూలు చేసే వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం రవాణా శాఖ దీనిపై పనిచేస్తుందని కూడా తెలిపారు. సగటున ఎనిమిది నిమిషాల పాటు ఒక వాహనం 2018 – 19 సమయంలో టోల్గేట్ వద్ద ఆగాల్సి వచ్చేది. అయితే ఫాస్ట్ ట్యాగ్ వచ్చిన తర్వాత 47 సెకండ్లకు తగ్గిందని నితిన్ గట్కరి గుర్తు చేశారు. అయితే ఇప్పుడు ఆ సమయాన్ని మరింత తగ్గించడానికి కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు.


Share

Related posts

UnStoppable 2: అన్‌స్టాపబుల్‌ సీజన్‌ 2పై న‌యా అప్డేట్ ఇచ్చిన బాల‌య్య‌..ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్‌!

kavya N

హైదరాబాద్ లో మరో భారీ అగ్ని ప్రమాదం .. ఆందోళన చెందుతున్న ప్రజలు

somaraju sharma

బండి సంజయ్ కి బిగ్ ఆఫర్ ప్రకటించబోతున్న అమిత్ షా, మోడీ..??

sekhar