NewsOrbit
న్యూస్ సినిమా

Indian-2 Movie: గండికోటలో కమల్ హాసన్ సందడి.. ఫోటో వైరల్!

Kamal Haasan-Gandikota

‘విక్రమ్’ సినిమాతో భారీ హిట్ కొట్టారు సీనియర్ హీరో కమల్ హాసన్. ఎన్నో ఏళ్ల తర్వాత భారీ హిట్ కొట్టి.. మళ్లీ తానేంటో మళ్లీ ప్రూవ్ చేసుకున్నారు. ఈ సినిమాకు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ వచ్చింది. గతేడాది జూన్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా.. మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేసింది. తమిళంలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అదే జోరును కంటిన్యూ చేయాలని కమల్ హాసన్ భావిస్తున్నారు. ప్రస్తుతం కమల్ హాసన్ ‘ఇండియన్-2’ సినిమా చేస్తున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో ఈ సినిమా షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది.

Kamal Haasan-Gandikota
Kamal Haasan Gandikota

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆంధ్రప్రదేశ్‌లోని జమ్మలమడుగు దగ్గరున్న గండికోటలో జరుగుతోంది. ఇక్కడ కమల్ హాసన్‌పై కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు సమాచారం. గండికోట దగ్గర ఇండియన్-2 సినిమా షూటింగ్ జరుగుతుందని తెలిసి కమల్ హాసన్‌ను చూసేందుకు అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Kamal Haasan-Gandikota
Kamal Haasan Gandikota

భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా.. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు డైరెక్టర్ శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జియాంట్ మూవీస్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కమల్‌ హాసన్‌కు జోడిగా స్టార్ హీరోయిన్ కాజల్ నటిస్తున్నారు. విక్రమ్ సినిమా సక్సెస్‌తో హ్యూజ్ క్రేజ్ సంపాదించుకున్న కమల్ సినిమాపై ప్రేక్షకులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. గతంలో భారతీయుడు సినిమా కూడా మంచి హిట్ కొట్టింది. ఈ సినిమా సీక్వెల్‌తో రూపొందబడుతున్న ‘ఇండియన్-2’ కూడా అదే స్థాయిలో హిట్ కొడుతుందని భావిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ‘విక్రమ్-2’ సినిమాలో చేయబోతున్నారు. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Kamal Haasan-Gandikota
Kamal Haasan Gandikota

అలాగే లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంతో కలిసి కమల్ హాసన్ ఓ సినిమా చేయబోతున్నారు. కమల్ కెరీర్‌లోనే ఇది 234వ చిత్రంగా రాబోతుంది. ఈ సినిమాకి సహ నిర్మాతలలో కమల్ హాసన్ కూడా ఒకరు కానున్నారు. బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొణె ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. హీరోయిన్‌గా త్రిష నటిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా కథ విషయానికి వస్తే.. సోషల్ మెసేజ్ మూవీ అని సమాచారం. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులతో వారసులు ఎలా ఉండాలి? అనే అంశంపై సినిమా సాగుతుందని ఇప్పటికే సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

author avatar
Raamanjaneya

Related posts

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri