NewsOrbit
టెక్నాలజీ న్యూస్

దేశం ఆర్థికంగా పుంజుకుంటుందా…?? ఐటి విభాగం ఏం చేపుతోంది..??

 

(న్యూఢిల్లీ నుండి “న్యూస్ అర్బిట్” బ్యూరో)

కరోనా మహమ్మారి ప్రభావం ప్రపంచంలోని అన్ని దేశాలతో పాటు భారతదేశంలోని అన్ని రంగాలపై పడింది అన్న విషయం తెలిసిందే. అనేక రంగాలు ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కూడా కనబడటం లేదు. భారత దేశం జిడిపి మొదటి క్వార్టర్ లో సుమారు 24 శాతం పడిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మైనస్ 10 శాతం కంటే ఎక్కువగా వృద్ధి రేటు పడిపోతుంది వార్తలు వస్తున్నాయి. అయితే ఈ తరుణంలో ఒక రంగం మాత్రం చాలా వేగంగా పుంజుకుంటోందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఏమిటా రంగం, ఎలా పుంజుకుంది. కారణాలు ఏమిటి అనేది తెలుసుకుందాం.

భారతదేశంలో ఐ టి రంగం మాత్రం ఊహించిన దాని కంటే వేగంగా పుంజుకుంటుందని అధ్యయనాలు చెబుతుండటం చాలా సంతోషకరమైన విషయం. ఐటి రంగంలో పని చేస్తున్న లక్షలాది మంది యువతీ యువకులు ఇది ఒక శుభ వార్త. ఐటి రంగం వేగంగా పుంజుకోనున్నది అని బిజినెస్ లైన్ పత్రిక ఒ సర్వే ఫలితాలను వెల్లడించింది. ఐటి పరిశ్రమలు ఎక్కువగా ఇతర దేశాల క్లైయింట్ లపై ఆధారపడి పని చేస్తుంటాయి. ఆయా దేశాలు ఆర్థిక సంక్షోభం నుండి వేగంగా పుంజుకోవడం వల్ల ఐటి రంగంలో పెట్టుబడులు పెరగడం వల్ల ఆ రంగం త్వరగా కోలుకునే అవకాశం ఉంది.

ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఆర్థిక సంక్షోంభం నుండి యూరప్, అమెరికా దేశాలు వేగంగా కోలుకుంటున్నాయి. అందుకు ప్రధాన కారణం ఆయా దేశాలలో ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలను అమలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మార్చి నెలలో రెండు లక్షల కోట్ల డాలర్ ల ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు. అదే విధంగా ఏప్రిల్ నెలలో 48వేల కోట్ల డాలర్ ల ప్యాకేజీ ఇచ్చారు. మొత్తంగా రెండున్నర లక్షల కోట్ల డాలర్ ల ఆర్ధిక ఉద్దీపన ప్యాకేజీని అందజేశారు. అలానే యుకేతో పాటు ఇతర యూరపియన్ దేశాలలో కూడా పెద్ద ఎత్తున ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించడం వల్ల ఆయా దేశాలలో ఆర్థిక పరిస్థితి వేగంగా పుంజుకుంటోంది. దీనికి తోడు బ్యాంకుల ద్వారా కంపెనీలకు తక్కువ వడ్డీకి సులభతరంగా పెద్ద ఎత్తున రుణాలు అందించే అవకాశం కూడా కల్పించారు. దీంతో అక్కడి ఐటి రంగంలోకి పెట్టుబడులు పెరిగే పరిస్థితి ఏర్పడుతోంది. అయా దేశాలలో ఆర్థిక పరిస్థితి మెరుగు పడటం వల్ల ఆ దేశాలపై ఆధారపడి ఉన్న ఐటి పరిశ్రమలు అన్నీ పూర్వ వైభవం సంతరించుకునే దిశగా అడుగులు పడతాయి.

 

author avatar
Special Bureau

Related posts

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju

YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర  

sharma somaraju

RS Praveen Kumar: బీఆర్ఎస్ కు కాస్త ఊరట .. గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

sharma somaraju

MLC Kavitha: కవితను అందుకే అరెస్టు చేశాం .. అధికారికంగా ఈడీ ప్రకటన

sharma somaraju

Manisha Koirala: పెళ్లైన మూడేళ్ల‌కే విడాకులు.. భ‌ర్త నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌పెడుతూ తొలిసారి నోరు విప్పిన మనీషా కోయిరాలా!

kavya N

Amritha Aiyer: హ‌నుమాన్ వంటి బిగ్ హిట్ ప‌డినా క‌లిసిరాని అదృష్టం.. అమృత ద‌శ తిరిగేదెప్పుడు..?

kavya N

Prabhas: పాన్ ఇండియా స్టార్ కాక‌ముందే బాలీవుడ్ లో ప్ర‌భాస్ న‌టించిన సినిమా ఏదో తెలుసా?

kavya N

మ‌హాసేన రాజేష్‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా స్కెచ్ వేసిన చంద్ర‌బాబు – ప‌వ‌న్‌…!

పైకి పొత్తులు – లోపల కత్తులు.. బీజేపీ గేమ్‌తో చంద్ర‌బాబు విల‌విలా…!

మ‌రో మ‌హిళా డాక్ట‌ర్‌కు ఎమ్మెల్యే సీటు ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు…?

Hanuman: హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్ కి కీరవాణి ఆవహించాడా? ఓటీటీ లో చూస్తూ పాటలు వింటుంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్ పాటలు విన్నట్టే ఉంటుంది!

kavya N

BRS: దానంపై అనర్హత వేటు వేయండి ..స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు

sharma somaraju

సికింద్రాబాద్‌లో ఈ సారి కిష‌న్‌రెడ్డి గెల‌వ‌డా… ఈ లాజిక్ నిజ‌మే…!

ష‌ర్మిల పోటీ ఎక్క‌డో తెలిసిపోయింది.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిందిగా…!

PM Modi: రాహుల్ గాంధీ ‘శక్తి’ వ్యాఖ్యలపై మోడీ కౌంటర్ ఇలా .. ‘శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్ నాలుగో తేదీ తెలుస్తుంది’  

sharma somaraju