NewsOrbit
టాప్ స్టోరీస్ ట్రెండింగ్ న్యూస్

ఈ గోడ ప్రపంచాన్ని పరీక్షించింది..! దేశాన్ని ఎన్నోసార్లు తలెత్తుకునేలా చేసింది..!!

 

ఆఫ్ సైడ్ బంతిని బాట్ తో ముట్టుకోకుండా ముచ్చటగా వదిలేసే బ్యాట్స్ మన్ ఎవరో తెలుసా..? ఆఫ్ వికెట్ వైపు వెళ్తున్న బంతిని వేటాడి స్లిప్ లో క్యాచ్ ఇచ్చేసి ఔట్ అయిపోతున్న ప్రపంచ బ్యాట్స్ మెన్ లకి “అరేయ్ బాబు ఆ బంతిని ఇలా బాట్ పైకెత్తి ముచ్చటగా వదిలేయాలిరా” అని నేర్పించింది ఎవరో తెలుసా..? అదే ఆఫ్ సైడ్ బంతి ఏ రిస్కు , ఏ స్వింగ్ లేకుండా వస్తే దాన్ని ముచ్చటగా అందమైన “స్క్వేర్ కట్” చేసి, బౌండరీకి తరలించేది ఎవరో తెలుసా..?
* బౌలర్లు యార్కర్ వేసినా.. బౌన్సర్ వేసినా.. స్వింగ్ చేసినా.. ఆఫ్ సైడ్ అవతల వేసి విసిగించినా… క్రీజ్ లో కుదురుకుని తిరిగి బౌలర్లనే గంటల తరబడి విసిగించే ఏకైక బ్యాట్స్ మెన్ ఎవరో తెలుసా..?
* సాధారణంగా డిఫెన్స్ ఆడితే అభిమానులు విసుక్కుంటారు. కానీ ఒక బ్యాట్స్ మన్ డిఫెన్స్ ఆడితే మాత్రం ముచ్చటగా చూస్తారు. డిఫెన్స్ అయినా, హుక్ షాట్ అయినా.., స్క్వేర్ కట్ అయినా, కవర్ డ్రైవ్, స్ట్రయిట్ డ్రైవ్ అయినా… మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించేలా ఆడే ఆటగాడు రాహుల్ ద్రావిడ్..! పై ప్రశ్నలన్నిటికీ సమాధానం ఆయనే..!! నేడు రాహుల్ ద్రావిడ్ 48 వ పుట్టినరోజు..! ఈయన గురించి ప్రత్యేక కథనం మీకోసం..!

 

*”టెస్ట్ ఇన్నింగ్స్ అంటే మనకు 2001 లో వీవీఎస్ లక్ష్మణ్ ఆస్ట్రేలియాపై ఆడిన 281 పరుగులు గుర్తొస్తాయి కదా..!? ఆ టెస్టులో లక్ష్మణ్ కి అండగా నిలిచింది.. 180 పరుగులు చేసింది.., లక్ష్మణ్ తో కలిసి ఐదో వికెట్ కి 376 పరుగుల రికార్డ్ భాగస్వామ్యం నెలకొల్పింది మన రాహుల్ ద్రావిడ్..!

భారత లెజెండరీ క్రికెటర్..! అందరి నోట ది వాల్ , మిస్టర్ డిపెండబుల్ గా ప్రశంసలు అందుకున్నాడు..! భారత క్రికెట్ కు 16 సంవత్సరాల పాటు సేవలందించాడు.. టెస్ట్ క్రికెట్ లో భారత్ కు ఎన్నో విజయాలను అందించాడు.. ఓడిపోతున్న మ్యాచ్ లను సైతం ఒంటి చేత్తో గెలిపించిన సమర్ధుడు.. క్రికెట్ తెలిసినవారికి రాహుల్ ద్రావిడ్ పరిచయం అవసరం లేని పేరు.. ఇతని ఫ్రంట్ డిఫెన్స్ ను విశ్లేషకులు ఎక్కువగా గుర్తు చేస్తూ ఉంటారు.. వికెట్లు కోల్పోయి టీం కష్టాల్లో పడినప్పుడు సాలిడ్ డిఫెన్స్ తో జట్టును ఆదుకుంటూ.. స్కోరు బోర్డుపై ఒక్కో రన్ జత చేయడంలో దిట్ట.. బ్యాటింగ్ మాస్ట్రో సచిన్, పిడుగులా తన స్టైల్ ఆఫ్ షార్ట్స్ తో ఆకట్టుకునే గంగూలీ, లక్ష్మణ్ లాంటి ప్లేయర్స్ తో కలిసి ఆడిన తనకంటూ ఓ ప్రత్యేకతను నిలబెట్టుకున్నాడు.. టెక్నిక్ , ఒత్తిడిలో పెర్ఫార్మెన్స్ పరంగా వాళ్ళ అందరికంటే బెస్ట్ బ్యాట్స్మెన్ గా కొనియాడతారు..! ఇతని గురించి ఎంత చెప్పినా తక్కువే..

 

*1973 జనవరి 11 న మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో మరాఠీ మాట్లాడే బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.
*మూడో నెంబర్ ఆటగాడిగా 10 వేల పరుగులు చేసిన తొలి ఆటగాడు.
*వన్డేల్లో రెండుసార్లు 300 పరుగుల భాగస్వామ్యం లో పాల్గొన్న ఏకైక వ్యక్తి
*ఐదు డబుల్ సెంచరీలు చేసిన ముగ్గురు భారతీయ క్రికెటర్ లో ద్రావిడ్ ఒకరు.

*ద్రావిడ్ టెస్టుల్లో 13,288 రన్స్ చేశారు. అందులో 36 సెంచరీలు, 63 అర్థ సెంచరీలు చేశారు. వన్డేల్లో పరుగులు చేయగా 12 సెంచరీలు, 86 అర్థ సెంచరీలు చేశారు. ఒకే ఒక టి20 లో 31 పరుగులు చేశారు. మొత్తం పరుగులు 24,208 నమోదు చేశారు. 2003 నుంచి 2007 వరకు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టారు.

 

*ప్రస్తుతం తన క్రికెట్ అకాడమీ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తుండమే కాకుండా అండర్ 19 ఇండియా ఏ జట్టు లను మెంటార్ గా పర్యవేక్షిస్తున్నారు . పృద్వి షా, శ్రేయాస్ అయ్యర్ , శుభమన్ గిల్, సంజూ శాంసన్, రిషబ్ పంత్ వంటి యువ ఆటగాళ్లు పర్యవేక్షణలో ఆరితేరారు.
*2015 లో భారత జూనియర్ క్రికెట్ జట్ల కోచింగ్ బాధ్యతను రవి స్వీకరించారు ఈ నాలుగేళ్ల కాలంలో ఆయన పర్యవేక్షణలో యువ క్రికెటర్లు మెరికల్లాగా తయారయ్యారు. అత్యుత్తమ ప్రదర్శన ను బయటకు రాబట్టడంలో ద్రావిడ్ కృషి మరిచిపోలేనిది.
*1998లో అర్జున అవార్డు పొందారు, 2000లో విజ్డన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, 2004లో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ తోపాటు పద్మశ్రీ,‌ ఐసీసీ టెస్ట్ ప్లేయర్, ఎమ్ టీవీ యూత్ ఐకాన్ పురస్కారాలు. బ్రాడ్ మన్ స్మారక ఉపన్యాసం ఇచ్చిన తొలి విదేశీ క్రికెటర్ ద్రావిడ్ కావడం గమనార్హం.

author avatar
bharani jella

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju