NewsOrbit
న్యూస్ ప్ర‌పంచం రాజ‌కీయాలు

Rishi Sunak: బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఎన్నికకు మార్గం సుగమం .. పోటీ నుండి తప్పుకున్న మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్

Rishi Sunak: బ్రిటన్ లో నవ యుగం ఆరంభం

Rishi Sunak:  భారత సంతతికి చెందిన బ్రిటన్ కన్జర్వేటివ్ నేత, మాజీ ఆర్ధిక మంత్రి రిషి సునాక్ ప్రధాని ఎన్నికకు మార్గం సుగమం అయ్యింది. ఇప్పటికే ఆయనకు 150 మందికిపైగా ఎంపీలు మద్దతుతో రేసులో ముందంజలో ఉండటంతో పాటు మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పోటీ నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించడంతో రిషి సునక్ ఎన్నిక దాదాపు ఖయమైనట్లేనని సమాచారం. ప్రస్తుతం పెన్నీ మెర్డాంట్ మాత్రమే సునక్ తో పాటు ప్రధాని రేసులో ఉన్నప్పటికీ ఆమె కనీసం వంద మంది ఎంపీల మద్దతును కూడగట్టుకోలేకపోయారని తెలుస్తొంది. పెన్నీ మొర్డాంట్ కు కేవలం 29 మంది ఎంపీల మద్దతే ఉన్నట్లు సమాచారం. ఈ మధ్యాహాన్నికి ఆమె వంద మంది ఎంపీల మద్దతు ఉందని నిరూపించలేకపోతే 142 మంది సభ్యుల మద్దతు ఉన్న రిషి సునాక్ ప్రధానిగా ఎకగ్రీవంగా ఎన్నిక అవుతారు. బ్రిటన్ ప్రధాని బాధ్యతలు చేపట్టే తొలి భారత సంతతి వ్యక్తిగా సరికొత్త చరిత్ర సృష్టిస్తారు.

Rishi Sunak: బ్రిటన్ లో నవ యుగం ఆరంభం
Rishi Sunak

 

బోరిస్ రాజీనామాతో ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్ 45 రోజుల వ్యవధిలోనే పదవి నుండి తప్పుకున్నారు. దీంతో బ్రిటన్ లో రాజకీయ సంక్షోభం నెలకొంది. లిజ్ ట్రస్ రాజీనామా చేయడంతో ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ మరో సారి పోటీకి రెడి అయ్యారు. విహార యాత్రలో ఉన్న బోరిస్ హుటాహుటిన లండన్ కు చేరుకుని పావులు కదిపారు. దాదాపు వంద మంది కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు ఆయనకు మద్దతు తెలిపినట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నారు. దాంతో పోటీ లేకుండా ప్రధాని అయ్యేందుకు ఆయన రిషి సునాక్, పెన్సీ మెర్డాంట్ తో చర్చలు జరిపారు. అయితే తనకు 142 మంది ఎంపీల మద్దతు ఉందనీ, పోటీ నుండి తప్పుకునేది లేదని రిషి స్పష్టం చేశారు. పోటీ జరిగితే గెలుపు అవకాశాలు ఉండవని భావించిన బోరిస్.. ప్రధాని రేసు నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

మరో పక్క రిషి సునాక్ పార్టీకి, దేశానికి సరైన వ్యక్తి అని మాజీ హోంశాఖ మంత్రి సుయెల్లా బ్రేవర్మన్ పేర్కొన్నారు. ఆయనకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. మొదటి నుండి బొరిస్ కు మద్దతుగా ఉన్న సుయెల్లా దేశంలో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులు మాారాలంటే పార్టీలో మార్పు రావాలని, ఇందుకు సరైన నాయకత్వం అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. ఇటువంటి సమయంలో రిషి సునాక్ సరైన నాయకుడని ఆమె స్పష్టం చేశారు.

భారత ఐటీ దిగ్గజ సంస్థ ఇన్పోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు రిషి సునాక్ అనేది అందరికీ తెలిసిందే. ఆయన కుమార్తె అక్షతా మూర్తి నే రిషి సునాక్ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju