NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఇస్రో రాకెట్ ప్రయోగం సక్సెస్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3 – ఎం 3 రాకెట్ ప్రయోగం సక్సెస్ అయ్యింది. అంతరిక్ష ప్రయోగాల్లో తిరుగులేని శక్తిగా భారత్ అవతరించింది. జీఎస్ఎల్వీ మార్క్ 3 ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేశామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు. వాణిజ్య ప్రయోగాలకు ఇస్రో ముందంజలో ఉందన్నారు.

Indian space research organization isro has launched another rocket

తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పెస్ సెంటర్ (షార్) నుంచి ఎల్వీఎం 3 వాహక నౌక నింగిలోకి దూసుకువెళలింది. శనివారం ఉదయం 8.30 గంటలకు ప్రారంభమైన కౌంట్ డౌన్ ప్రక్రియ 24,30 గంటల పాటు కొనసాగింది. ఈ ఉదయం 9 గంటలకు వన్ వెబ్ కు చెందిన 36 ఉప గ్రహాలను ఎల్వీఎం – 3 వాహన నౌక తీసుకువెళ్లింది. ఈ ఉపగ్రహం బరువు 5.8 టన్నులుగా శాస్త్రవేత్తలు తెలిపారు. అనంతరం ఈ ప్రయోగం సక్సెస్ అయినట్లు ఇస్త్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఉపగ్రహాలను ఎల్వీఎం – 3 సురక్షితంగా కక్షలోకి ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ రెండు దశల్లో 72 ఉపగ్రహాలను ప్రయోగించడానికి వన్ వెబ్ తో ఒప్పందం చేసుకుంది. దీనిలో భాగంగా మొదటి 36 ఉప గ్రహాలను గత ఏడాది అక్టోబర్ 23న ఇస్రో విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టింది. తాజాగా రెండో విడత 36 ఉపగ్రహాలను పంపింది.

ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయోగం సక్సెస్ అయ్యిందన్నారు. ఇది ఇస్ర్రో సిబ్బంది సమిష్టి కృషి వల్లే సాధ్యమైందని పేర్కొన్నారు. వచ్చే నెలలో పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా సింగపూర్ కు చెందిన ఉపగ్రహాన్ని ప్రవేశపెడతామని తెలిపారు. దీనికి సంబంధించి పని జరుగుతోందన్నారు. మార్క్ 3 రాకెట్ ద్వారా మరిన్ని వాణిజ్య ప్రయోగాలు చేస్తామని చెప్పారు. జీఎస్ఎల్ వీ మార్క్ 3 రాకెట్ ను మరింత అభివృద్ధి చస్తామని ఆయన వెల్లడించారు.

Breaking: మంత్రి ఆదిమూలపు సురేష్ కు తప్పిన ప్రమాదం

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju