ఏనుగు పేడతో తయారు చేసిన మద్యం రుచి చూశారా ఎప్పుడైనా..? కనీసం మద్యం తయారు చేస్తారన్న ఆ సంగతి మీకు తెలుసా..? ఏనుగు మలం తో తయారు చేసిన ఈ జిన్ తాగితే “వన్స్ మోర్” అనాల్సిందేనట.. ఇండ్లోవు (Indlovu )జిన్ గురించి మరిన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఏనుగు పెడ తో తయారీ అంటే ఛీ.. అనాల్సిన అవసరం లేదు.. దీని రుచి చూస్తే అస్సలు వదలరు.. పౌలా, లెస్ అన్ స్లేస్ అనే బయోలజీ మాజీ ప్రొఫెసర్లు రిటైర్ అయిన తరువాత యూకే నుంచి దక్షిణాఫ్రికా వెళ్లారు. కొన్ని సంవత్సరాల క్రితం ఇద్దరు ప్రొఫెసర్ లెస్ అన్ స్లేస్ కు ఈ ఆలోచన కలిగింది. దక్షిణాఫ్రికాలోని యానిమల్ రిజర్వ్ చూడటానికి అప్పుడు వాటి ఆహారం గురించి చి అక్కడి సంరక్షకుడు వివరించాడు. ఏనుగు శాకాహారి అనే విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అనేక రకాల మొక్కలు, చెట్లు, ఆకుల్ని, ఆహారం గా తీసుకుంటుంది. ఏనుగులు తినే ఆహారంలో సగం కంటే తక్కువ మేతను మాత్రమే శరీరానికి తీసుకుంటాయని, మిగతా సగం చెక్కు చెదరకుండా మలం ద్వారా బయటకు వచ్చేస్తుంది అని తెలుసుకున్నాడు. ఒక సంరక్షకుడు ఇన్ని వివరాలు చెబుతుంటే ప్రొఫెసర్ ఆశ్చర్యపోయాడు. దీంతో ఏనుగు గు మలాన్ని సరికొత్త జిన్ లో సహజ పదార్థంగా ఎందుకు ఉపయోగించకూడదు అని, ఆ దిశగా 2018లో ఇండ్లోవు జిన్ తయారీకి శ్రీకారం చుట్టారు ఈ ఇద్దరు ప్రొఫెసర్లు..
ఆఫ్రికా, యూరప్ దేశాల్లో ఈ మద్యం రుచి అదుర్స్ అంటూ చీర్స్ కొడుతున్నారు. దీంతో తయారీ దారులకు మంచి లాభాలు పొందుతున్నరు. అలా లాభాల్లో వచ్చిన 15 % వాటా ను ఆఫ్రికా ఏనుగుల సంరక్షణ ఫౌండేషన్ కి ఇస్తున్నారు. మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఇండ్లోవు జిన్ రుచి కోసం ఆఫ్రికాన్స్ నాలుక కోసుంకుంటరంటా..