Jabardasth : జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో గురించి అందరికీ తెలిసిందే. దాదాపు 8 ఏళ్ల నుంచి ఈ షో సూపర్ డూపర్ గా ఈటీవీలో నడుస్తోంది. ఇప్పటి వరకు తెలుగు టీవీ షోలలో జబర్దస్త్ ను బీట్ చేసిన షో లేదు అంటే అతిశయోక్తి కాదు. ఎన్ని కామెడీ షోలు వచ్చినా.. దాని ముందు దిగదుడుపే. అది జబర్దస్త్ కు ఉన్న పాపులారిటీ, క్రేజ్. జబర్దస్త్ ప్రారంభం అయినప్పుడు దానికి ఒక రూపం ఇచ్చింది… కామెడీ స్కిట్లు చేయాలంటే… ఒక థీమ్ ను ఏర్పాటు చేసింది మాత్రం మెగా బ్రదర్ నాగబాబు, సీనియర్ నటి రోజా. వీళ్లిద్దరు చాలా ఏళ్ల పాటు జబర్దస్త్ కు జడ్జిలుగా ఉన్నారు.

కానీ.. తర్వాత నాగబాబు జబర్దస్త్ ను వదిలేశారు. ఆయన తన సొంత యూట్యూబ్ చానెల్ పెట్టుకున్నారు. ఖుషీ ఖుషీగా కామెడీ షోను రన్ చేస్తున్నారు. తర్వాత జీ తెలుగులో బొమ్మ అదిరింది షోలో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. మరికొన్ని షోలలోనూ చేస్తున్నారు.
నాగబాబు.. జబర్దస్త్ ను వీడినా… రోజా మాత్రం వీడలేదు. నాగబాబు ప్లేస్ లో ప్రముఖ సింగర్ మనో వచ్చారు. తర్వాత మళ్లీ యథావిథిగా జబర్దస్త్ స్టార్ట్ అయింది.
కానీ… తాజాగా జబర్దస్త్ ఎపిసోడ్ ప్రోమోలో చూస్తే మాత్రం రోజా బదులు సీనియర్ నటి ఇంద్రజ వచ్చింది. ఇంద్రజ వచ్చి జడ్జిగా వ్యవహరించడంతో రోజా ఎటు వెళ్లింది… అనే చర్చ ప్రస్తుతం నెటిజన్లలో నడుస్తోంది.
Jabardasth : రోజా గుడ్ బై చెప్పిందా?
ఒకవేళ రోజా.. జబర్దస్త్ కు గుడ్ బై చెప్పిందా? అందుకే ఇంద్రజను మల్లెమాల వాళ్లు తీసుకున్నారా? లేక ఏదైనా పని ఉండి రోజా రాలేకపోయిందా? అనే విషయాలపై మాత్రం ప్రస్తుతం క్లారిటీ లేదు.
మొత్తానికి రోజా బదులు వచ్చిన ఇంద్రజనే జడ్జిగా కంటిన్యూ చేయండి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంద్రజ, మనో.. ఇద్దరి కాంబో బాగుంది.. సూపర్ గా సెట్ అయింది అంటూ నెటిజన్లు చేస్తున్న కామెంట్లపై మల్లెమాల యాజమాన్యం ఏం ఆలోచిస్తుందో వేచి చూడాల్సిందే.