Sudha kongara: సుధ కొంగర వంటి లేడీ డైనమిక్ డైరెక్టర్ సినిమా ఇండస్ట్రీకి ఎంతో అవసరం..

Share

Sudha kongara: సుధ కొంగర..సౌత్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రతిభావంతురాలు. ఆమె దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్ని ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్స్‌గా నిలిచి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేశాయి. ఆమె రచయితగా, దర్శకురాలిగా స్క్రీన్ రైటర్‌గా ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులారిటీని సంపాదించుకున్నారు. సుధ కొంగర ఎక్కువగ తమిళ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు. ఆమె 49వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ ఆంగ్ల చలన చిత్ర పురస్కారాన్ని దక్కించుకున్నారు. భారతీయ ఆంగ్ల చిత్రం మితర్, మై ఫ్రెండ్ వంటి సినిమాకు సుధ కొంగర స్క్రీన్ రైటర్‌గా పనిచేశారు.

industry needs lady dynamic director like Sudha kongara...
industry needs lady dynamic director like Sudha kongara…

అలా పాపులారిటీ సంపాదించుకున్న ఆమె లెజండరీ డైరెక్టర్ మణిరత్నంతో కలిసి ఏడేళ్లు అసోసియేట్‌గా ఉన్నారు. ఇక 2016 లో సుధ కొంగర ‘సాలా ఖడూస్’ అనే హిందీ చిత్రంతో బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇదే సినిమాను తమిళంలో ‘ఇరుది సుత్రు’ గానూ రూపొందించారు. ఈ సినిమాతో హిందీ తమిళంలో ఉత్తమ దర్శకురాలిగా ఫిలింఫేర్ అవార్డు సంపాదించుకున్నారు. ఇలా రెండు భాషాలో సూపర్ హిట్ సాధించి అవార్డు దక్కించుకున్న సినిమానే తెలుగులో గురుగా రీ మేక్ చేశారు. 2017లో వచ్చిన ఈ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు.

Sudha kongara: కానీ సూర్య ఆమెను నమ్మాడు.

విక్టరీ వెంకటేశ్, రితిక సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఇక్కడ కూడా భారీ సక్సెస్ సాధించింది. ఇలా ఒకే సినిమాను మూడు భాషలలో తెరకెక్కించి సక్సెస్ అందుకోవడం చాలా కష్టం. అతికొద్ది సార్లు మాత్రమే ఒకే కథతో తెరకెక్కిన సినిమాలు హిట్ అవుతుంటాయి. ఒక భాషలో హిట్ అయిన కథ మరో భాషలో తీసి చేతులు కాల్చుకున్న వారు లేకపోలేదు. కానీ ఏ భాషలో తీసిన సుధ కొంగర మేకింగ్ స్టైల్‌తో సూపర్ హిట్ సాధించారు. ఈ సినిమా తరువాత ఎయిర్ డక్కన్ వ్యవస్థాపకుడైన కెప్టెన్ జి.ఆర్ గోపీనాధ్ జీవితం ఆధారంగా ‘సూరరై పొత్రు’ అనే సినిమాను తెరకెక్కించారు.

కోలీవుడ్‌లో గత కొంతకాలంగా ఆశించిన సక్సెస్ లేక సూర్య రేస్‌లో వెనకబడిపోయాడు. అలాంటి సమయంలో బయోపిక్ తీయడం అంటే పెద్ద సాహసమే. అది కూడా లేడీ డైరెక్టర్‌తో. కానీ సూర్య ఆమెను నమ్మాడు. ఆమె కథ తయారు చేసిన విధానాన్ని..దాన్ని ఎలా స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తారో ఊహించాడు. అందుకే ఈ సినిమాను నిర్మించేందుకు సూర్య ముందుకు వచ్చాడు. తమిళంలో తెరకెక్కించిన ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేశారు. అయితే కరోనా కారణంగా థియేటర్స్ మూతపడటంతో థియేటర్స్ ఓపెన్ కోసం ఎదురు చూసి తప్పని పరిస్థితుల్లో ఓటీటీతో మంచి ఢీల్ కుదుర్చుకొని రిలీజ్ చేశారు.

 

Sudha kongara: సుధ కొంగర, హీరో సూర్యకి గొప్ప ప్రశంసలు దక్కాయి.

భారీ లాభాలను తేవడంతో పాటు అటు తమిళంలో ఇటు తెలుగులో విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ముఖ్యంగా దర్శకురాలు సుధ కొంగర, హీరో సూర్యకి గొప్ప ప్రశంసలు దక్కాయి. ఇలాంటి డైరెక్టర్ సినిమా ఇండస్ట్రీకి ఎంతో అవసరం అని సినీ ప్రముఖులందరు పొగడ్తలతో ముంచేశారు. ప్రస్తుతం ఈమె మరోసారి సూర్య హీరోగా సినిమా చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అలాగే తెలుగులో కూడా ఓ స్టార్ హీరోతో సినిమా రూపొందించేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను ఓ అగ్ర నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నట్టు తెలుస్తోంది.

 


Share

Related posts

బాలాకోట్ శవాలు ఇవేనంటూ..!

Kamesh

Reality: ఈ  కారణాలు వింతగా ఉన్న..  ఎవరైనా నిజమే అనాల్సిందే!!

siddhu

తరగని రాజశం – చెదరని దర్పం  – తెలుగు సినిమాలో పోటీ అనే ప్రశ్న కూడా లేని మేటి సూపర్ స్టార్

siddhu