NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

ఆ కుర్చీపై పెద్ద తలకాయలే కర్చీఫ్ వేశాయి..! గ్రేటర్ మేయర్ కోసం తీవ్ర పోటీ..!!

జీహెచ్ఎంసీ మేయర్ పదవిని దక్కించుకునేందుకు టీఆర్ఎస్ లో తీవ్ర పోటీ నెలకొంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచే ఆశావహులు మేయర్ సీటు కోసం లాబీయింగ్ మొదలుపెట్టారు.

ఇందుకోసం టీఆర్ఎస్ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక వచ్చే నెల 10 తర్వాత నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇదే క్రమంలో ఎస్​ఈసీ శనివారం కొత్త కార్పొరేటర్ల పేర్లతో గెజిట్ నోటిఫికేషన్  విడుదల చేసింది. చట్టం ప్రకారం గెజిట్ విడుదల చేసిన నెల రోజుల్లోపు  మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు నిర్వహించాలి. రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ పదవులను లాటరీ ద్వారా ఎంపిక చేసినప్పుడు జీహెచ్ఎంసీ మేయర్  జనరల్ మహిళకు దక్కింది. దీంతో మేయర్ సీటును సొంతం చేసుకునేందుకు పెద్ద పెద్ద లీడర్ల కూతుళ్లు, కోడళ్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కొందరు లీడర్ల భార్యలు కూడా ఇందు కోసం పోటీ పడుతున్నారు.

అధికార పార్టీకే మేయర్ కుర్చీ!

పూర్తి స్థాయి మెజార్టీ లేకున్నా టీఆర్ఎస్ పార్టీనే మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను దక్కించుకోనుంది. మొత్తం 150 డివిజన్లలో మేయర్ సీటు సొంతం చేసుకునేందుకు సగం కంటే ఒకటి ఎక్కువ సీట్లు అంటే 76 సీట్లు గెలవాలి. కానీ టీఆర్ఎస్  56 సీట్లనే గెలిచింది. మజ్లిస్ తో ఎలాంటి అవగాహన లేకుండానే, తనుకున్న ఎక్స్ అఫీషియో ఓట్లతో  టీఆర్ఎస్ మేయర్ సీటు దక్కించుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం టీఆర్ఎస్ కు 56 మంది కార్పొరేటర్లు, 32 మంది ఎక్స్ అఫీషియో ఓటర్లు, బీజేపీకి 48 కార్పొరేటర్లు, ముగ్గురు ఎక్స్ అఫీషియో ఓటర్లు, మజ్లిస్ కు 44 మంది కార్పొరేటర్లు, 10 మంది ఎక్స్ అఫీషియో ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్​కు  ఇద్దరు కార్పొరేటర్లు, ఒక్క ఎక్స్ అఫీషియో ఓటు ఉంది. అయితే బీజేపీకి చెందిన లింగోజిగూడ కార్పొరేటర్​ రమేశ్​గౌడ్​ ఇటీవల చనిపోయారు.

గట్టి మేయర్ కోసం టీఆర్ఎస్ గాలింపు!

కాగా జీహెచ్​ఎంసీ కౌన్సిల్ లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీఆర్ఎస్ స్థానం సంపాదించుకున్నా.. బీజేపీ కంటే కేవలం 8 సీట్లే ఆ పార్టీకి ఎక్కువ వచ్చాయి. దీంతో ప్రతి కౌన్సిల్ సమావేశంలో బీజేపీ సభ్యులు టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టే  చాన్స్  ఉంది. అందుకని కౌన్సిల్ సమావేశాలను చాకచక్యంగా నిర్వహించే మేయర్ అభ్యర్థి కోసం టీఆర్ఎస్  వెతుకుతోంది. రాజకీయ పరిజ్ఞానం, వివిధ సమస్యలపై అవగాహన ఉన్న మహిళా కార్పొరేటర్లు ఎవరనేది ఆరా తీస్తోంది. ఒక్కొక్కరి పూర్తి బయోడేటాను తెప్పించుకొని పరిశీలిస్తున్నట్టు సమాచారం.

రేసులో కేకే, పీజేఆర్ కూతుళ్లు!

ఎంపీ కె.కేశవరావు కూతురు విజయలక్ష్మి మేయర్ పదవి కోసం ప్రయత్నిస్తున్నట్టు టీఆర్​ఎస్​లో  చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లోనే మేయర్ సీటు కోసం ఆమె ప్రయత్నించారు. పార్టీలో చేరిననాటి నుంచి ఇప్పటివరకు కేకే కు సీఎం కేసీఆర్ ప్రయార్టీ ఇస్తున్నారని, కేకే కూడా పార్టీలో నిలబద్దతతో ఉన్నారని ఆయన అనుచరులు చెప్తున్నారు. తన తండ్రి నిబద్దతనే తనకు కలిసి వస్తుందని విజయలక్ష్మి ధీమాగా ఉన్నారు. కానీ కేకేకు రెండోసారి రాజ్యసభ సీటు ఇవ్వడంతో విజయలక్ష్మికి మేయర్ సీటు దక్కే చాన్స్ తక్కువని పార్టీ లీడర్లు మాట్లాడుకుంటున్నారు.దివంగత నేత పీజేఆర్ చరిష్మాతో మేయర్ సీటును సొం తం చేసుకునేం దుకు ఆయన కూతురు విజయారెడ్డి ప్రయత్నిస్తున్నారు.

గత జీహెచ్ఎంసీ ఎన్ని కల్లోనే ఆమె మేయర్ పదవి కోసం చివరి నిమిషం వరకు ప్రయత్నించి ఫెయిలయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే సీటు అడిగారు. కానీ టీఆర్ఎస్ పెద్దలు కాంగ్రెస్ నుంచి వచ్చిన దానం నాగేందర్ కు సీటు ఇవ్వడంతో మరోసారి ఆమెకు చుక్కెదురైంది. ఈసారి మాత్రం తనకు మేయర్ సీటు దక్కుతుందనే ధీమాలో విజయారెడ్డి ఉన్నట్టు ఆమె సన్ని హితులు చెప్తున్నారు.ఇంకా ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి కోడలు సింధూ ఆదర్శ్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు విజయశాంతి, లీడర్లు మన్నె గోవర్దన్​రెడ్డి భార్య మన్నె కవిత, మోతే శోభన్ రెడ్డి భార్య శ్రీలత కూడా మేయర్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీలో చర్చ నడుస్తోంది.

 

author avatar
Yandamuri

Related posts

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N