Vijayawada: ఇటీవల కాలంలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామన్న మనస్థాపంతోనో, ప్రేమ విఫలం అయ్యిందనో, పెద్దలు పెళ్లికి అంగీకరించడం లేదనో, వరకట్నం కోసం భర్త వేధిస్తున్నాడనో ఇలా అనేక రకాల కారణాలతో క్షణికావేశంలో యువతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా విజయవాడ పోరంకిలోని ఓ కార్పోరేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ గదిలో ఉరి వేసుకుని విద్యార్ధిని మృతి చెందడం కలకలాన్ని రేపింది. ఇంటర్ చదువుతున్న వాణి (17) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నది.

ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ కావడంతో మనస్థాపంతో సూసైడ్ చేసుకుందని యాజమాన్యం చెబుతోంది. అయిత వాణి డైరీలోని పేజీలు మాయం కావడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్ధిని వాణి స్వస్థలం గుంటూరు జిల్లా ఫిరంగిపురం అని సమాచారం. ఈ విషయం తెలియడంతో విద్యార్ధి సంఘాలు సదరు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. వాణి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది. విద్యార్ధి ఆత్మహత్య పై పోలీసు దర్యాప్తులో కారణాలు వెలుగుచూసే అవకాశం ఉంది.
Byju’s: బైజ్యూస్ సీఈఓ రవీంద్రన్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు