Astrology : బుధవారం జన్మించిన వారు చామనఛాయతో ఉంటారు. సౌమ్యంగా మాట్లాడతారు. వీరు ఎప్పుడు ఉల్లాసం గా, ఉత్సాహం గా ఉండటానికి ప్రయత్నం చేస్తారు.. ఆధ్యాత్మిక చింతన, దేవుడి పై భక్తి ఎక్కువగా ఉంటుంది. తమ తెలివితేట లను నమ్ముకుని ముందుకు సాగుతారు. ఎవరో చెప్పారు కదా అని గుడ్డిగానమ్మరు. సభలయందు అనర్గళం గా ఉపన్యసించగల శక్తి ఉంటుంది.
గురువారం పుట్టినవారు మధ్యమ దేహమును అందమైన మొహం గలవారై ఉంటారు. అందరినీ కలుపుకొని పోవడం అంటే చాలా ఇష్టం. కోపం, గొడవలంటే అసలు నచ్చదు. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు. చిరునవ్వుతో ఏదైనా సాధించలేనిది లేదు అని అనుకునే స్వభావం వీరిది. కష్టపడే తత్వం ఎక్కువ గా ఉంటుంది. ప్రతి క్షణం చురుగ్గా ఉంటారు.అనేక విషములందును, ఆరితేరిన వారై ఉంటారు .
శుక్రవారముపుట్టినవారు, తేజోవంతులుగా ఉంటారు. రజోగుణము ప్రధానముగా ఉండి విచ్చలవిడిగాతిరుగుతారు. సర్వ శాస్త్రకోవిదులుగా కీర్తి పొందుతారు. శుక్రవారం రోజు జన్మించిన వారు అందరితో నూ సహజం గా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు. కొంత మందిలా వారికి జీవితం లో నటించడం అంటే ఇష్టం ఉండదు. ఎదుటివాళ్ళు చెప్పే విషయాలను చాలా త్వరగా నమ్ముతారు . చాలా క్రియేటివిటీగా ఆలోచన చేస్తారు. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరితోనూ ఒకే విధం గా ఉంటారు.. కొందరు కార్యాలయం ప్రధాను లుగా పనిచేస్తారు. .
శనివారంము పుట్టినవారు నల్లని దేహము కలిగి మంద మతులై ఉంటారు. వీళ్ళు చేసే ప్రతి పనిలో కుటుంబ సభ్యులు అండగా, తోడుగా, వెన్నుదన్నుగా ఉంటారు . యవ్వన వయస్సులో కొన్ని సమస్యలు వచ్చినా కూడా , తమ భవిష్యత్ గడిచేకొద్దీ ఉజ్వలం గానే ఉంటుంది. వ్యవసాయం, వ్యవసాయం గురించి తెలుసుకోవడం అన్నా, ఆ దిశ గా వెళ్లడం అన్నా ఆసక్తి ఎక్కువ గా ఉంటుంది. పెద్దగా మాట్లాడరు.చాలా సున్నితమైన మనస్సు కలిగి నవారు మరియు అందం గా ఉంటారు.