25.7 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
న్యూస్ సినిమా

Shamitha Shetty: షమితా శెట్టి బర్త్ డే.. శిల్పా శెట్టి ఎమోషనల్ పోస్ట్.. షమితా గురించి తెలియని ఆసక్తికర విషయాలు!

Shamita Shetty
Share

బాలీవుడ్ నటి షమితా శెట్టి పేరు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ ఆమె సోదరి శిల్పా శెట్టి అందరికీ సుపరిచితురాలే. మాజీ విశ్వసుందరి అయిన శిల్పాశెట్టి.. నటిగా, మోడల్‌గా రాణిస్తున్నారు. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 40కిపైగా సినిమాలు చేశారు. ఆమె మొదటి చిత్రం బాజీగర్. ‘ఆగ్’ అనే సినిమాతో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. అక్క బాటలోనే చెల్లెలు షమితా శెట్టి రాణిస్తున్నారు. మోడల్‌గా, నటిగా, ఇంటీరియర్ డిజైనర్‌గా రాణిస్తున్నారు. 2000లో విడుదలైన ‘మొహబ్బతీన్’ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతోనే ఆమెకు స్టార్ డెబ్యూ ఆఫ్ ది ఇయర్- ఫిమేల్ కేటగిరీలో ఐఫా అవార్డు అందుకుంది.

Shamita Shetty
Shamita Shetty

బేవఫా, క్యాష్ వంటి చిత్రాల్లో నటించింది. ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్-3(2009)లో కంటెస్టెంట్‌గా ఎంపికై.. తనకంటూ ప్రత్యేక ఫాలొయింగ్‌ను పెంచుకుంది. ఆ తర్వాత ‘ఝలక్ దిఖ్లాజా’, ఖత్రోన్ కే ఖిలాడీ-9, బిగ్ బాస్ ఓటీటీ, బిగ్ బాగ్‌బాస్-15 వంటి రియాలిటీ షోల్లో పాల్గొంది. బిగ్‌బాస్-15లో ఫైనలిస్ట్ గా కూడా సెలక్ట్ అయింది. సినిమాలతోపాటు మ్యూజిక్ వీడియోలు కూడా చేస్తోంది. ఒక వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు షోలు, ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తుంటారు. అలాగే సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. తన డైలీ అప్‌డేట్స్ ను ఫోటోలు, వీడియోల రూపంలో షేర్ చేస్తుంటారు.

Shamita Shetty
Shamita Shetty

షమితాపై రూమర్లు

‘పిలిస్తే పలుకుతా’ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది షమితా శెట్టి. ఈ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. అందుకే పూర్తి స్థాయిలో బాలీవుడ్ సినిమాలకే పరిమితమైంది. అయితే ఈ మధ్యకాలంలో షమితా శెట్టిపై భారీగానే రూమర్స్ వస్తున్నాయి. బాలీవుడ్ నటుడు అమీర్ అలీతో డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్‌లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ రూమర్లపై షమితా శెట్టి ఘాటుగానే స్పందించింది. తాను సింగిల్‌గానే ఉన్నట్లు చెప్పుకొచ్చింది. ఇలాంటి రూమర్లను స్ప్రెడ్ చేయడం ఆపాలని గట్టి వార్నింగ్ ఇచ్చింది.

Shamita Shetty
Shamita Shetty

షమితా బర్త్ డే.. అక్క ఎమోషనల్ పోస్ట్..

షమితా శెట్టి 2 ఫిబ్రవరి 1979లో ముంబైలో జన్మించారు. షమితా అంటే శిల్పా శెట్టికి ఎంతో ప్రేమ. చాలా వరకు షోల్లో పాల్గొన్నప్పుడు వీరిద్దరూ గంటల తరబడి మాట్లాడుతారని, షాపింగ్స్ కు వెళ్లినా, తిరగడానికి వెళ్లినా ఇద్దరూ కలిసే ఉంటారని చెబుతుంటారు. అలాంటి గారాల చెల్లెలి పుట్టిన రోజు నేడు (గురువారం). ఈ సందర్భంగా సోషల్ మీడియాలో శిల్పా శెట్టి ఎమోషనల్ పోస్ట్ రాసుకొచ్చింది. ఈ సందర్భంగా శిల్పా శెట్టి మాట్లాడుతూ.. ‘చిన్నప్పుడు చాకెట్లు లాక్కునేవాళ్లం. ఒకరి బట్టలను ఒకరు మార్చుకునేవాళ్లం. గొడవ పడేటప్పుడు ఒకరి జట్టు మరొకరు పట్టుకుని కొట్టుకునేవాళ్లం. ఎంత గొడవ పడ్డా.. ఎన్ని అల్లర్లు చేశామో? అంతే ప్రేమగా ఉంటున్నాం. ఐ లవ్ యూ టు ది మూన్ అండ్ బ్యాక్.. హ్యాపీ బర్త్ డే, మై డార్లింగ్ టుంకీ. కలకాలం సంతోషంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉంటూ హ్యాపీగా జీవించాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు.’ అని తాము ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది శిల్పా శెట్టి.


Share

Related posts

Human: మనుషులతో దాగుడు మూతలు  ఆడటం అంటే వీటికి చాలా ఇష్టమట!!

siddhu

మార్చి వరకు పొడిగించమంటున్న రాష్ట్రాలు…!

bharani jella

Pushpa : “పుష్ప” ఫస్ట్ సింగిల్ ‘దాక్కో దాక్కో మేక’ రిలీజ్ డేట్ ఫిక్స్

GRK