Tamil Nadu Politics: వస్తానంటున్న చిన్నమ్మ !వద్దు పొమ్మంటున్న అన్నాడీఎంకే!తమిళనాట ఆసక్తికర రాజకీయ పరిణామాలు !!

Share

Tamil Nadu Politics: మొన్నటి ఎన్నికల్లో తమిళనాడులో ఓటమిపాలైన అన్నాడీఎంకేకు పూర్వ వైభవం తెచ్చేందుకు తాను మళ్లీ రాజకీయాల్లోకి వస్తానంటూ చిన్నమ్మ గా ప్రసిద్ది పొందిన జయలలిత నెచ్చెలి శశికళ చెప్పడం ఆ పార్టీ లో ప్రకంపనలు రేపుతోంది. ఈ వార్తలు రాగానే పార్టీకి నీఅవసరం లేదులే అంటూ అన్నాడీఎంకే స్పందించటం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతోంది.

Interesting political drama in Tamil Nadu !!
Interesting political drama in Tamil Nadu !!

రెండు నెలల క్రితం రాజకీయ సన్యాసం!

అన్నాడీఎంకేలో జయలలిత తర్వాత అంతటి స్థానం కలిగిన శశికళ అనేక కారణాల వల్ల తన ప్రాభవం కోల్పోవడం, జైలుకు వెళ్లడం వంటి పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే.జైలు నుంచి విడుదలయ్యాక ఆమె మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చక్రం తిప్పుదామనుకున్నా సాధ్యపడలేదు .బిజెపితో అన్నాడీఎంకే పొత్తుపెట్టుకోవడం వల్ల శశికళకు సీన్ లేకుండా పోయింది.అనివార్య కారణాలతో శశికళ రాజకీయ సన్యాసం స్వీకరించారు ఏప్రిల్ ఆరో తేదీన జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఆమెకే పాత్ర లేకుండానే ముగిసిపోయాయి అయితే అన్నాడీఎంకే ఓటమి పాలైంది.డీఎంకే అధికారంలోకి వచ్చింది.

మళ్లీ చిన్నమ్మలో చిగురించిన ఆశలు!

ఈ నేపధ్యంలో తిరిగి అన్నాడీఎంకేలో కీలక పాత్ర వహిస్తే తనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందన్న ఆశలు చిన్నమ్మలో చిగురించాయి.తన ముఖ్య సహచర లిద్దరికీ ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఆమె మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో టేపు లీక్ లీక్ అయింది.”ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని గాటిన పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.నేను తప్పక వస్తాను”అని శశికళ తన మద్దతుదారుడొకరికి ఫోన్ లో చెప్పిన ఆడియో టేప్ బయటికొచ్చింది.మరో మద్దతుదారునితో ఆమె ఫోన్లో మాట్లాడుతూ” నాతో సహా ఎంతోమంది కష్టపడటం వల్లే అన్నాడిఎంకె అంత పటిష్టంగా తయారైంది.ఇప్పుడున్న నేతలు అంతర్గత కలహాల వల్ల ఆ పార్టీ బీటలు వారుతుంటే నేను ప్రేక్షకురాలిగా చూస్తూ ఊరుకోలేను”అని శశికళ చెప్పటం రెండో ఆడియో టేపులో వినిపించింది.దీంతో ఆమె రీఎంట్రీకి సిద్ధపడినట్లు స్పష్టమవుతోంది.కరోనా ఉధృతి తగ్గాక, సాధారణ పరిస్థితులు నెలకొన్నాక ఆమె మళ్లీ రాజకీయంగా స్పీడ్ అయ్యే అవకాశాలున్నాయి.

Read More: Vaccine: వాక్సిన్ లపై విస్తుగొలిపే నిజాలు బయటకు..!?

Tamil Nadu Politics: అన్నాడీఎంకే స్పందన ఏమిటంటే?

కాగా శశికళ ఆడియో టేపులు వెలువడిన వెంటనే అన్నాడీఎంకే స్పందించింది.శశికళ ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి పార్టీలోకి రానిచ్చేది లేదని అన్నాడీఎంకే డిప్యూటీ కోఆర్డినేటర్ మునుస్వామి కుండబద్దలు కొట్టేశారు.అన్నాడీఎంకేలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయంటూ పార్టీ నాయకులను,కార్యకర్తలను ఆమె కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు.పార్టీ ఎవరి వల్ల నష్టపోయిందో అందరికీ తెలుసునని, మళ్లీ ఆమె వచ్చి ఉద్దరించేదేమీ లేదని కూడా మునుస్వామి వ్యాఖ్యానించారు.రానున్న రోజుల్లో ఈ పరిణామాలు ఏ మలుపు తీసుకుంటాయో చూడాలి.


Share

Related posts

పబ్జీ స్థానంలో కొత్త గేమ్స్ వచ్చేసాయి..! చూశారా..!

bharani jella

భారత్ -పాక్ నూక్లియర్ కేంద్రాల వివరాల మార్పిడి

Siva Prasad

ఇంత కష్టపడ్డా కూడా థమన్ కి ఆ క్రేజ్ రావడం లేదే ..?

GRK