Internet Desk : అందం, అభినయంతో వెండి తెర ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఒకప్పటి హీరోయిన్స్.. సోషల్ మీడియాలో తమ గ్లామర్ ఫోటోలు, వీడియో లతో అభిమానుల హృదయాలను కొల్లగొడుతున్నారు.. నెట్టింట సందడి చేస్తున్నారు.. ఇటీవల సోషల్ మీడియా లో హల్ చల్ చేసిన హీరోయిన్స్ ఫొటోస్ పై ఓ లుక్కేయండి..!
చూపించేస్తున్న ఆదా..
చూపించండే.. మీ అందచందాలు మొత్తం చూపించండే.. అంటూ హార్ట్ ఎటాక్ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన భామ ఆదా శర్మ.. ఇప్పటికైనా చూపిస్తే పోలా అనుకుందేమో మరి.. ఆరబోతతో రెచ్చిపోతోంది..ఆదా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్.. రెగ్యులర్గా ఫోటోలు పోస్ట్ చేస్తూ మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది.. తాజాగా సముద్రతీరంలో చీరకట్టులో పల్టీలు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.
గోవా బ్యూటీ :
దేవదాసు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తెలుగు తెరకు కొత్త అందాలను రుచి చూపించిన ఇలియానా.. గ్లామర్ రోల్స్ చేయడంలో తనను మించిన హీరోయిన్ లేదన్నట్టుగా రాణించింది ఈ గోవా బ్యూటీ.. ఇదే జోష్ తో బాలీవుడ్లో అడుగుపెట్టింది ఈ భామ.. తెలుగులో అక్బర్ అమర్ ఆంటోనీ సినిమా తర్వాత ఏ సినిమా కనిపించలేదు.. సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్ గా ఉంటుంది ఈ అమ్మడు. తరచూ తన ఫోటోలతో ఇంటర్నెట్ను వేడెక్కిస్తోంది..
నేహా శర్మ అందాల ఆరబోత..
చిరుత సినిమా లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన వేముల పరిచయమైంది నేహా శర్మ.. ఆ తరువాత వరుణ్ సందేశ్ సరసన కుర్రాడు సినిమాలో కనిపించింది టాలీవుడ్ లో రెండు సినిమాలు చేసినా ఈ అమ్మడికి పెద్దగా అవకాశాలు రాలేదు.. ప్రస్తుతం మలయాళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు అందాల ఆరబోతకు అడ్డూ అదుపూ లేదు.. తాజాగా స్నేహ షేర్ చేసిన ఫోటోలు ఆహా అనిపిస్తున్నాయి..
బ్యూటీ సోనాల్ చౌహన్ :
సోనాల్ చౌహన్.. టాలీవుడ్ లో బాలయ్య సరసన లెజెండ్, డిక్టేటర్ తాజాగా రూలర్ సినిమాలో నటించింది.. లెజెండ్ సినిమా సూపర్ హిట్ అయినా కూడా తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.. ప్రస్తుతం దీ పవర్ అనే హిందీ సినిమాలో నటిస్తోంది.. కానీ ఈ అమ్మడు వీలు దొరికినప్పుడల్లా విదేశీ బీచ్ లో బికినీ ల తో ఫోటోలకి ఫోజులు ఇస్తూ.. కుర్రాళ్ళ మతులు పోగొడుతుంది..
బబ్లీ బ్యూటీ పూనమ్ బజ్వా..
“మొదటి సినిమా “తో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన బబ్లీ బ్యూటీ పూనమ్ బజ్వా.. తక్కువ సినిమాల్లో నటించిన మంచి గుర్తింపు తెచ్చుకుంది.. పరుగు, బాస్ చిత్రాల్లో నటించి మెప్పించింది ఈ ముంబై ముద్దుగుమ్మ.. ఆ తర్వాత మలయాళీ, తమిళ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యారు. ప్రస్తుతం హీరోయిన్ మలయాళంలో ఓ సినిమా చేస్తోంది.
నిషా ఎక్కిస్తున్న నిషా అగర్వాల్..
అందాల తార కాజల్ చెల్లెలిగా సినీరంగ ప్రవేశం చేసింది నిషా అగర్వాల్.. ఏమైంది ఈవేళ, సోలో వంటి చిత్రాలలో నటించింది.. సోలో తో ఒక సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.. ఆ తర్వాత తెలుగు , తమిళ చిత్రాల్లో నటించినప్పటికీ అనుకున్న రీతిలో విజయాన్ని అందుకోలేక పోయాయి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన గ్లామర్ ఫోటోషూట్స్ తో అందరినీ ఆకట్టుకుంటుంది ఈ భామ.