NewsOrbit
న్యూస్

ఇకపై సిసి కెమెరాల ‘కను’సన్నలలోనే నిందితుల ఇంటరాగేషన్!’పోలీసు హింస’కు చెక్ పడేలా సుప్రీంకోర్టు ఆదేశాలు!

నిందితులు చేత నేరాలను అంగీకరింపజేసేందుకు పోలీసులు వారిని హింసిస్తారన్న అపవాదు లేకపోలేదు.కొన్ని సందర్భాల్లో నిందితులకు థర్డ్ డిగ్రీ ట్రీట్ మెంట్ కూడా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి.

ఈ క్రమంలో ఎన్నో లాకప్ మరణాలు కూడా సంభవించాయి. అయితే ఇకపై వీటికి తెర పడే విధంగా సుప్రీంకోర్టు ఒక మంచి నిర్ణయం తీసుకుంది . పోలీస్​ స్టేషన్లలోని ఇంటరాగేషన్, లాకప్​ రూముల్లో సీసీ కెమెరాలు పెట్టాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. సీబీఐ, ఎన్ఐఏ, ఈడీ వంటి విచారణ సంస్థల ఆఫీసుల్లోనూ సెక్యూరిటీ కెమెరాలు పెట్టాలని పేర్కొంది. కస్టడీలో నిందితులపై హింసను అరికట్టేందుకు సీసీ కెమెరాలతో పాటు ఆడియో రికార్డింగ్​ కూడా చేయాలని సూచించింది. దేశంలోని అన్ని పోలీస్​ స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్​ప్లేసులతో పాటు లాకప్​ రూములు, కారిడార్, స్టేషన్​ రిసెప్షన్​ ఏరియా, సబ్​ ఇన్​స్పెక్టర్, ఇన్​స్పెక్టర్​ రూమ్​లు, వాష్​ రూమ్​ బయట సీసీ  కెమెరాలను అమర్చాలంది.

ఈ ఏర్పాట్లకు అవసరమైన నిధులు కేటాయించాలని, నిర్ణీత సమయంలోపల సీసీటీవీ కెమెరాలను అమర్చాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం ఆదేశించింది. ఈ ఏర్పాట్లకు సంబంధించి పూర్తి యాక్షన్​ ప్లాన్​ను ఆరు వారాల్లోగా కోర్టుకు సమర్పించాలని పేర్కొంది. ఈ కెమెరాల్లో రికార్డైన పుటేజ్​ను, ఆడియో రికార్డింగ్​ను 18 నెలల పాటు జాగ్రత్త చేయాలని, అవసరమైతే కోర్టులకు ఎవిడెన్స్​గా అందజేయాలని పేర్కొంది. పోలీస్​ స్టేషన్లలో విచారణ సందర్భంగా మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా ఇండిపెండెంట్​ ప్యానెల్​తో తరచూ సీసీటీవీ ఫుటేజ్​ చెకింగ్​ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ప్రతీ జిల్లాలో హ్యూమన్​ రైట్స్​ కోర్టులను ఏర్పాటు చేయాలని ఆర్డర్​ వేసింది.

పంజాబ్​లో జరిగిన కస్టోడియల్​ డెత్​కు సంబంధించిన కేసు విచారణలో సుప్రీం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇంటరాగేషన్​ ఏరియాలలో కెమెరాల ఏర్పాటుకు 2018లోనే ఆదేశాలు జారీ చేసినా.. ఇప్పటి వరకూ అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఏర్పాట్ల సంబంధించిన వివరాలను వచ్చే నెల 27న పరిశీలిస్తామని కోర్టు తెలిపింది.సుప్రీంకోర్టు ఆదేశాల పట్ల ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.ఇది చాలా మంచి చర్య అని ప్రజా చైతన్య వేదిక అధ్యక్షుడు జగదీష్ వర్మ వ్యాఖ్యానించారు.ఈ ఆదేశాలు ఇవ్వటమే కాకుండా అవి తప్పనిసరిగా అమలు జరిగేలా చూడాలని సుప్రీంకోర్టును ఆయన కోరారు!

 

author avatar
Yandamuri

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!