Intinti Gruhalakshmi: లాస్య వివేక్ దగ్గరకు వచ్చి బాగున్నావా అంటూ కుశల ప్రశ్నలు వేస్తుంది. అసలు నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు అని వివేక్ రివర్స్ కేర్ లో ప్రశ్నిస్తాడు. లాస్యకి తన భర్త డివోర్స్ ఇచ్చాడు. తులసిని ఆశ్రయం ఇచ్చి ఈ ఇంట్లో ఉండనిస్తుంది అని నందు చెబుతాడు. అమ్మ తులసి నువ్వు కొందరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని వివేక్ అంటాడు. ఇక తులసి దగ్గరకు వెళ్ళిన లాస్యకి చేదు అనుభవం ఎదురవుతుంది. నువ్వు అనుకున్నవన్నీ ఇక్కడ జరగవు అని తులసి మొహం మీద చెప్పేస్తుంది.

వివేక్ తో ఆ అమ్మాయి నాకు చదువుకున్న అబ్బాయే భర్తగా రావాలని కోరుకున్నాను. ఆ విషయమే నేను మా వాళ్లతో చెప్పలేను. మీరు నేను నచ్చలేదని ఈ సంబంధం క్యాన్సిల్ చేయమని తను అడుగుతుంది. ఆ విషయం మీరే మీ ఇంట్లో వాళ్లతో చెప్పొచ్చు కదా అని విక్రమ్ అంటాడు. విక్రమ్ ఆ అమ్మాయి మాట్లాడుకొని లోపలికి రాగానే.. పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటున్నామని పెద్దవాళ్ళు అంటారు అప్పుడే ఆ అమ్మాయి నాకు ఈ పెళ్లి సంబంధం ఇష్టం లేదని చెబుతుంది. పైగా విక్రమ్ కి కూడా నాకు మంచి సలహా ఇచ్చినందుకు థాంక్యూ చెప్పేసి వెళ్తుంది. మరోవైపు విక్రమ్ కి దివ్య ఫోన్ చేసి మనం మొన్న కలుసుకున్న ప్లేస్ కి రమ్మని చెబుతుంది.

నందు వాళ్లందరూ భోంచేస్తుండగా లాస్య డేర్ గా వచ్చి నందు పక్కన కూర్చుంటుంది వెంటనే వివేక్ ఏంటి నందు పక్కన వచ్చి కూర్చున్నావు అని లాస్యను ప్రశ్నిస్తాడు అమ్మ తులసి నువ్వు ఈ విషయంలో ఇలా మౌనంగా ఉంటే సరికాదు అని వివేక్ అంటాడు అప్పుడే నందు తులసి చేతిని పట్టుకొని తులసి వచ్చి నా పక్కన కూర్చొని లాస్య ముందే తులసి చేతిని పట్టుకుంటాడు. వెంటనే చెయ్యి వదిలేసి సారీ అన్నట్టుగా తులసి వైపు చూస్తాడు. దానికి వివేక్ నవ్వుకుంటూ ఇప్పటికీ నీకు ఇంత భయం ఏంటి రా అని నందుని ఆటపట్టిస్తాడు.
ఇక రేపటి ఎపిసోడ్ లో దివ్య విక్రమ్ కలుసుకున్నారు. అప్పుడే చదువు లేని అబ్బాయి కేఫ్ లో పనిచేయడం చూసి ఒక అతను తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఇక చదువు లేని అబ్బాయిని మీరు పెళ్లి చేసుకుంటారా అనే విక్రమ్ ఇంట్లో పని చేసే అతను అడగగా దివ్య ఏం సమాధానం చెబుతుందో చూడాలి.