Intinti Gruhalakshmi: అమ్మ దివ్య ఆ అబ్బాయి ఎంత మంచివాడైనా కానీ ఈ డబ్బులు మన దగ్గర ఉండడం మంచిది కాదు.. తనకి చేయమని తులసి చెబుతుంది. అలాగే తనని మన ఇంటికి కూడా రమ్మని చెప్పు అని తులసి అంటుంది ఎందుకు అని దివ్య అడగగా.. ముఖం మీద బొట్టు.. రామచంద్రుడి లాగా చూడ చక్కని మోము మొహం మీద ఎప్పుడూ చిరునవ్వు చాలా ప్రశాంతంగా కనిపిస్తాడు అని అన్నావు కదా మేం కూడా ఆ మొహాన్ని చూస్తామని తులసి నవ్వుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

దివ్య విక్రమ్ మీకు కలవడానికి వస్తున్నాను అని తనకి ఫోన్ చేసి చెబుతుంది అలాగే తనకి ఓ లొకేషన్ కూడా షేర్ చేసి అక్కడికి రమ్మని చెబుతుంది. విక్రమ్ ఆ కేఫ్ లో దివ్య కోసం ఆత్రుతగా వెయిట్ చేస్తూ కనిపిస్తాడు. అంతలో తన స్నేహితురాలు కనిపించడంతో అవును నువ్వు అమెరికా వెళ్తున్నావని విన్నాను కానీ. నీ ప్రవర్తన ఏమి బాగోలేదు. తల్లిదండ్రులను వదిలేసి వాళ్ళ ఆస్తిని తీసుకోని ఆ డబ్బులతో నువ్వు అమెరికా వెళ్లాలని అనుకోవడం కరెక్ట్ కాదు వాళ్ళని నేను ఓల్డ్ ఏజ్ హోమ్ లో జాయిన్ చేస్తాను కదా అని తను అంటే నీకు ఏమైనా పిచ్చా నీ నిర్ణయం మార్చుకోవాలి విక్రమ్ సలహా ఇస్తాడు .
నువ్వు ఎప్పుడు అంతే విక్రమ్ నీకు లాగా నేను ఉండలేను అని ఇద్దరూ వాదించుకుంటుండగా వారి మాటలను విన్న దివ్య చిన్న బుచ్చుకుంటుంది . విక్రమ్ చెడ్డవాడని డిసైడ్ అవ్తుంది. ని కలవడానికి వెళుతుంది కాకపోతే విక్రమ్ ఓ అమ్మాయితో కాస్త రూడ్ గా మాట్లాడుతూ కనిపిస్తాడు ఇప్పటివరకు నిన్ను మంచివాడని అనుకున్నాను. ఇప్పటితో నేను నిజస్వరూపం ఏంటో తెలిసింది అని దివ్య విక్రమ్ ని అరుస్తుంది. అమ్మాయిల్ని వంచించే బుద్ధి నీకు ఉందని నాకు ఇప్పటివరకు తెలియదు. ఇంకోసారి నాకు ఫోన్ చేస్తే నీకు మర్యాదగా ఉండదు అని చెప్పి దివ్య స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వచ్చేస్తుంది. విక్రమ్ అసలు ఏమైందో కూడా అర్థం కాక జుట్టు పీక్కుంటాడు.
ఇక నందుకి తన ఫ్రెండ్ అమెరికా నుంచి వస్తున్నానని ఫోన్ చేస్తాడు. ఇక తులసి వంట తిని చాలా రోజులైంది. తనతో వంట చేయించమని కూడా చెబుతాడు . ఇక అదే విషయాన్ని లాస్యతో చెప్పి తన సలహా తీసుకుంటాడు. ఆ ఫ్రెండ్ వచ్చినప్పుడు తులసి భార్య లాగా నా పక్కనే నటించమని చెబుతాడు. ఇక ఆ మాటలకు ఇంట్లో వాళ్ళందరూ నందు పై ఫైర్ అవుతారు.