Bank: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక రేపో రేటును వరుసగా పెంచుతుండడంతో ఫిక్స్డ్ డిపాజిట్ లపై అధిక వడ్డీని ఆఫర్ చేయడానికి బ్యాంకులు కూడా ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా ఫిక్స్డ్ డిపాజిట్ లపై ప్రభుత్వ రంగ బ్యాంకులు అందించే వడ్డీ రేట్ల మధ్య పోలికను ఇప్పుడు చూద్దాం..

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా:
ఈ బ్యాంకు ఐదేళ్ల నుంచి పదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్ లపై సీనియర్ సిటిజెన్లకు 6.92 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఇక మూడు నుంచి ఐదు యేళ్ళ ఫిక్స్డ్ డిపాజిట్లు పై కూడా అదే వడ్డీ రేటును ఆఫర్ చేస్తూ ఉండడం గమనార్హం.
కెనరా బ్యాంక్:
ఈ బ్యాంక్ 5 యేళ్ళ కాల పరిమితితో కూడిన ఫిక్స్డ్ డిపాజిట్లు పై సీనియర్ సిటిజనులకు ఏడు శాతం వడ్డీని అందిస్తోంది. అదే మూడు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాల కాల పరిమితి ఫిక్స్డ్ డిపాజిట్లపై కూడా ఏడు శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఇక రూ.2 కోట్లలోపు నాన్ కాలబుల్ డిపాజిట్ లపై సీనియర్ సిటిజన్లకు 7.45% వడ్డీ లభిస్తుంది.
బ్యాంక్ ఆఫ్ ఇండియా:
ఐదేళ్ల నుంచి 8 ఏళ్లలోపు ఫిక్స్ డిపాజిట్ లపై సీనియర్ సిటిజెన్లకి 6.75% వడ్డీ అందిస్తోంది. అదే 8 నుంచి 10 ఏళ్లలోపు ఫిక్స్ డిపాజిట్ లపై కూడా అదే వడ్డీ ఆఫర్ చేస్తోంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్:
10 సంవత్సరాల ఫిక్స్ డిపాజిట్ ల పై సీనియర్ సిటిజనులకు ఏడు శాతం వడ్డీ అందిస్తుండగా.. ఐదేళ్ల నుంచి పదేళ్ల కాల పరిమితిగా ఉన్న ఫిక్స్ డిపాజిట్ ల పై 7.3% వడ్డీ అందిస్తోంది. సాధారణ ప్రజలకు 6.5 0% వడ్డీని ఆఫర్ చేస్తోంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా:
ఐదేళ్ల నుంచి పదేళ్ల ఫిక్స్ డిపాజిట్లపై సీనియర్ సిటిజెన్లకు 7.5% వడ్డీ , సామాన్య ప్రజలకు 6.5 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.