Chiranjeevi: బాబీ సినిమాలో మెగాస్టార్ పాత్రపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్..ఎన్నో ఏళ్ళ తర్వాత అన్నయ్యను ఇలా చూడబోతున్నాము.

Share

Chiranjeevi: మెగా స్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి నాలుగు సినిమాలను చేస్తున్నారు. ఒకవైపు ఆచార్య సినిమాను రిలీజ్‌కు సిద్దం చేస్తున్న చిరు మరో మూడు సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. ఈ నాలుగు సినిమాలలో నాలుగు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. గాడ్ ఫాదర్ సినిమాను మోహన్ రాజా దర్శకత్వంలో చేస్తున్న చిరు ఇందులో డీసెంట్‌లో కనిపించబొతున్నారు. ఇది మలయాళ సూపర్ హిట్ సినిమా లూసీఫర్‌కు రీమేక్‌గా తెరకెక్కుతోంది. సమ్మర్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

intresting update from chiranjeevi-bobby movie
intresting update from chiranjeevi-bobby movie

ఇక ఫిబ్రవరి 4న ఆచార్య సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న చిరు రెండు నెలల గ్యాప్‌లోనే గాడ్ ఫాదర్ సినిమాను రిలీజ్ చేసేలా చూస్తున్నారట. ఆ తర్వాత రెండు నెలల గ్యాప్‌లో మరో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మెగాస్టార్. అయితే ఇందులో ఏ సినిమాను ముందు రిలీజ్ చేస్తారో అనేది మరికొన్ని రోజులు ఆగితేగాని క్లారిటీ వస్తుంది. ఇప్పటికే మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాను చేస్తున్నారు. ఇటీవల ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేశారు. ఈ ఫస్ట్ షెడ్యూల్‌లో ఓ భారీ ఫైట్, సాంగ్ కంప్లీట్ చేశారు. అలాగే సెకండ్ షెడ్యూల్‌ను మొదలు పెట్టారు.

Chiranjeevi: ఈ సినిమా కథ వైజాగ్ పోర్ట్ బ్యాక్ డ్రాప్‌లో సాగుతుందని సమాచారం.

ఈ క్రమంలోనే ముఠా మేస్త్రి తరహాలో ఉండే పాత్రలో బాబి సినిమా చేస్తున్నారు చిరు. ఈ సినిమా కథ వైజాగ్ పోర్ట్ బ్యాక్ డ్రాప్‌లో సాగుతుందని సమాచారం. అయితే ఇందులో మెగాస్టార్ క్యారెక్టర్ ఇప్పటివరకు అందరూ పోర్ట్‌లో పనిచేసే కూలీ అని అనుకున్నారు. చిరు ఫస్ట్ లుక్ కూడా అలాగే రిలీజ్ చేశారు. కానీ, ఇందులో అసలు పాత్ర వేరే ఉంటుందట. చిరు సినిమా మొత్తం కూలీగా కనిపించి చివరిలో పోలీస్ ఆఫీసర్‌గా రివీల్ అవుతారని తెలుస్తోంది. ఇదే సినిమాకు పెద్ద హైలెట్ అని సమాచారం. ఇదే నిజమైతే అన్నయ్యను చాలా ఏళ్ల తర్వాత పోలీస్ పాత్రలో చూడవచ్చు.


Share

Related posts

ఆసీస్ 236/6

Siva Prasad

Harish Rao : ఫోర్లు సిక్సర్లతో దుమ్మురేపిన మంత్రి హరీష్ రావు..!!

sekhar

బ్రెజిల్ నట్స్‌ వలన పురుషులు ఎలాంటి లాభాలు పొందుతారో తెలిస్తే అస్సలు వదలరు!!

Kumar