Chiranjeevi Bhola shanker : భోళా శంకర్ మూవీ షూటింగ్, మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్ మీకోసం..!

Share

Chiranjeevi Bhola shanker : మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ మూవీకి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్‌మెంట్ ఇటీవలే రాగా, ఈ చిత్రం షూటింగ్‌ను నవంబర్ 11 న ప్రారంభించాలని చిత్రయూనిట్ భావించింది. అందుకోసం ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అవి పూర్తయితే రెగ్యులర్ షూటింగ్ ఈనెల 15 నుంచి అధికారికంగా ప్రారభించాలని దర్శకుడు మెహర్ రమేశ్ భావించారట.. ఇప్పటికే షూటింగ్(shooting) కోసం ఒక భారీ సెట్‌ను సిద్ధం చేశారని టాక్. అందులోనే కొన్ని కీలక సీన్లు చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలిగా మహానటి ఫేం కీర్తి సురేష్ (Keerthi suresh) నటించనున్నారు. హీరోయిన్‌గా తమన్నను ఫిక్స్ చేసిందట చిత్రబృందం. మొదటి షెడ్యూల్‌ను త్వరగా పూర్తిచేయాలని దర్శకుడు ఆతృతగా ఉన్నట్టు తెలిసింది.

Megastar Chiru: బ్రేకింగ్..చిరంజీవిపై విష ప్రయోగం..??

చిరంజీవి చెప్పినట్టుగానే..

భోళా శంకర్ చిత్రాన్ని 40 నుంచి 50 రోజుల్లో పూర్తిచేయాలని చిరు ముందే దర్శకుడికి వివరించారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. కాస్త అటు ఇటు అయినా 60 రోజులకు మంచి డేట్స్ లేవని మెగాస్టార్(Mega star) ముందుగానే మెహర్ రమేశ్‌కు చెప్పారట.. అంతలోనే ఈ సినిమాను ముగించి తర్వాతి ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు చిరు సిద్ధంగా ఉన్నారట.. అయితే, భోళా శంకర్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళంకు రీమేక్. తమిళ్‌లో హీరో అజిత్ (Ajith)ఇందులో లీడ్ రోల్ చేశారు. అయితే, కొన్ని సీన్లను మార్చి తెలుగు నెటివిటీకి అనుగుణంగా భోళా శంకర్ సినిమా స్క్రిప్ట్‌ను దర్శకుడు రెడీ చేసి వినిపించగా చిరంజీవి ఒకే చెప్పారని తెలిసింది.

Chiranjeevi: ఫ్లాప్ డైరెక్టర్, యంగ్ మ్యూజిక్ డైరెక్టర్‌తో మెగాస్టార్ సాహసం..ఇది వర్కౌట్ అవుతుందా అంటూ సందేహాలు..
వరుసగా సినిమాలను లైన్లో పెట్టిన మెగాస్టార్..

ఇప్పటికే చిరు కోరటాల శివ డైరెక్షన్‌లో ‘ఆచార్య’ సినిమాను షూటింగ్‌ను పూర్తి చేసుకున్నాడు. సంక్రాంతి బరిలో ఆచార్య విడుదలకు సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ పండుగ బరిలో ఆర్ఆర్ఆర్ ఉన్నట్టయితే ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయాలని చిత్రనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట..ఇక పోతే చిరు తదుపరి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘గాడ్ ఫాదర్’ను పట్టాలెక్కించడానికి చిరంజీవి రెడీగా ఉన్నారని తెలిసింది. మలయాళంలో భారీ హిట్ అందుకున్న ‘లూసీఫర్’(lusifar) మూవీని తెలుగులో గాడ్ ఫాదర్‌ పేరుతో వస్తోంది. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాను కూడా శరవేగంగా పూర్తి చేయాలని చిరంజీవి నిర్ణయించుకున్నారని టాక్.. ఆచార్య విడుదలకు సిద్ధంగా ఉండగా, మరోవైపు భోళా శంకర్‌ను పట్టాలెక్కబోతున్నది.. ఆ వెంటనే గాడ్ ఫాదర్ కూడా చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రానుంది. 2022లో చిరు నటించిన మూడు సినిమాలు వరుసగా రిలీజ్ అవుతుండటంతో మెగా అభిమానులు ఫుల్లు ఖుషీలో ఉన్నారు. ఇక 2023లో డైరెక్టర్ బాబీతో కూడా ఓ సినిమా చేయనున్నట్టు చిరంజీవి ప్రకటించారని టాక్..

Prabhas – Chiranjeevi: సైరాతో పాన్ ఇండియన్ స్టార్‌గా మారిన మెగాస్టార్ ప్రభాస్‌ను బీట్ చేయగలరా..?


Share

Related posts

Bigg Boss 5 Telugu: అంతా బాగానే ఉన్నా సన్నీ గేమ్ లో.. ఇదే అతి పెద్ద మైనస్ అంటున్న జనాలు..!!

sekhar

మూడో రకం కరోనా.. ఆఫ్రికా దేశాల సరిహద్దులు క్లోజ్ చేసిన యూరప్ దేశాలు..??

sekhar

ఆడవారు ముఖ్యం గా గర్భిణీలు గాజులు వేసుకుంటే ఏమి జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్య పోతారు.

Kumar