పెరుగుతున్న ఇన్వెస్టర్లు.. ఆ రెండు కంపెనీలు లాభాల్లో..

investers eyes on stock market
Share

కరోనా పరిస్థితుల్లో వ్యవస్థలు నిస్తేజమైపోయిన వేళ ప్రజలంతా పెట్టుబడుల వైపు ఆకర్షితులయ్యారు. ఈక్రమంలో ఈక్విటీ మార్కెట్ పై ఆసక్తి చూపిస్తున్నారు. జూన్ నెలలో సెన్సెక్స్ 7.8 శాతం పెరుగుదల నమోదు చేసింది. జూలై నెలలో కూడా మార్కెట్ జోరందుకోవడంతో ఇన్వెస్టర్లు పెరిగారు. చిన్న మొత్తాలుగా పొదుపు చేసేందుకు అవకాశం ఉండటంతోనే వీరంతా ఆకర్షితులయ్యారు.

investers eyes on stock market
investers eyes on stock market

 

ముఖ్యంగా జూలై 20 నుంచి 23వ తేదీ మధ్యలో 1.5 లక్షల మంది కొత్త ఇన్వెస్టర్లు రిజిస్టర్ అయ్యారు. మొత్తంగా నెల రోజుల్లో 11 లక్షల మంది రిజిస్టర్ అయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి 19వేల మంది వరకూ రిజిస్టర్ అయ్యారు. బీఎస్ఈలో 5.2 కోట్ల మంది ఇన్వెస్టర్లు రిజిస్టర్ కాగా.. ఏడాదిగా ఈ సంఖ్య 1.3 కోట్లుగా ఉంది. 2009లో సెన్సెక్స్ 7.9 శాతం లాభపడింది. మళ్లీ 2020లో సూచీలు కనిష్టానికి పడిపోవడంతో స్టాక్ మార్కెట్లు ఏకంగా 32 శాతం లాభపడ్డాయి. స్టాక్ మార్కెట్ జోరు జూన్ నెలలో మొదలై జూలై లోనూ కొనసాగుతోంది. వివిధ షేర్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి.

రిలయన్స్ నెల రోజుల్లోనే భారీ రిటర్న్స్ ఇచ్చింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు బాగానే పెరుగుతున్నాయి. ప్రస్తుతానికి 3.6కు పెరిగి రూ.2,131 పలికింది. కంపెనీ క్యాపిటలైజేషన్ ఇంచుమించు రూ.14లక్షల కోట్లకు చేరుకుంది. నెల వ్యవధిలోనే 22 శాతం లాభపడింది. కొత్తగా లిస్ట్ అయిన రోజరీ బయోటెక్ భారీ లాభాల్లో ఉంది. అయిదేళ్ల కాలంలో లిస్టయిన తొలి రోజునే 75 శాతం పెరిగింది. షేర్ ధర రూ.755 పలికిదంది. గత అయిదేళ్లలో 11 కంపెనీలు మాత్రమే లిస్టింగ్ లో లాభపడినట్టు తెలుస్తోంది.


Share

Related posts

Big Breaking: పంజాబ్ లో బిగ్ ట్విస్ట్..పీసీసీ అధ్యక్ష పదవికి సిద్దూ రాజీనామా..!!

somaraju sharma

Congress Party : తమిళనాట తడాఖా చూపాలని కాంగ్రెస్ ఉబలాటం ! రంగంలోకి దిగుతున్న రాహుల్ బాబు!!

Yandamuri

Pseudo Ghee: కల్తీ  నెయ్యిని ఇలా  కనిపెట్టండి !!

Kumar