గ్యాస్ బుకింగ్‌కు ఫోన్ నెంబర్ ఛేంజ్..! దేశ వ్యాప్తంగా ఒకే నెంబర్..!!

 

(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఐ ఒ సి) గ్యాస్ బుకింగ్ నెంబర్‌ను మార్పు చేసింది. ఇకపై దేశ వ్యాప్తంగా ఒకే ఫోన్ నెంబర్‌ను గ్యాస్ బుకింగ్‌కు కేటాయించింది. నవంబర్ 1వ తేదీ నుండి కొత్త మొబైల్ నెంబర్ 7718955555 ద్వారా మాత్రమే గ్యాస్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇప్పటి వరకూ పని చేస్తున్న అన్ని నెంబర్‌లు నేటి నుండి (అక్టోబర్ 31) నుండి నిలిపివేస్తున్నట్లు ఐఒసి ప్రకటించింది. నూతన నెంబర్ 24 గంటలు పని చేస్తుందనీ, గ్యాస్ వినియోగదారులు తమ రిజిస్టర్ మొబైల్ నుండి మాత్రమే బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ సేవలను ఉపయోగించుకునేందుకు గ్యాస్ వినియోగదారులు తమ వినియోగదారు సంఖ్య (కన్య్జూమర్ నెంబర్) ను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఐఒసి అధికారులు తెలియజేసిన కొత్త బుకింగ్ నెంబర్ ను ప్రతి ఒక్క గ్యాస్ వినియోగదారులు నమోదు చేసుకోవాలి. నవంబర్ 1వ తేదీ నుండి ప్రతి ఒక్క ఐఓసి గ్యాస్ వినియోగదారుడు కొత్త నెంబర్ కు ఫోన్ చేసి బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.