హైదరాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు…! రూ.16 కోట్లు స్వాధీనం..!!

Share

 

(హైదరాబాదు నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

హైదరాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ ముఠా సభ్యులను అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ.16 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ, ముంబాయి. ఢిల్లీ, రాజస్థాన్ కేంద్రంగా ఒ ముఠా పెద్ద ఎత్తున క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతోంది. రాజస్థాన్ ఏటీఎస్ టీమ్ సోదాలు నిర్వహించగా ఏడుగురు ముఠా సభ్యులు దొరికారు. వారి వద్ద నుండి రూ.16లక్షల నగదు, సెల్ ఫోన్లు, ల్యాప్ ట్యాప్‌లు స్వాధీనం చేసుకున్నారు.

ఐపీఎల్ ప్రారంభం అయినప్పటి నుండి దేశ వ్యాప్తంగా ఈ ముఠా క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతోంది. సైబరాబాద్ పరిధిలోనే ఈ ముఠా సభ్యులు బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. బెట్టింగ్ రాకెట్ నడుపుతున్న గణేష్ తో పాటు సురేష్, పంకజ్, సత్యయ్య మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. గణేష్ అనే వ్యక్తి అన్ని రాష్ట్రాలలో ముఠాలను ఏర్పాటు చేసి ఈ క్రికెట్ బెట్టింగ్ వ్యవహారాన్ని నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దేశ వ్యాప్తంగా ఇంత పెద్ద మొత్తంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా సభ్యులను పట్టుకోవడం ఇదే ప్రధమమని తెలుస్తోంది.


Share

Related posts

Nimmagadda Ramesh Kumar : ఆ ఇద్దరు ఉన్నతాధికారులకు బదిలీ వేటు లేనట్లే..!!

somaraju sharma

నేడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి విజయవాడ రాక..! ఎందుకంటే..?

Special Bureau

AP Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై కేంద్రం ఇచ్చిన తాజా క్లారిటీ ఇదీ..!!

somaraju sharma