IPL 2021: మరో భారత క్రికెటర్ కు కరోనా పాజిటివ్..!

IPL 2021 prasiddh krishna tested positive for covid 19
Share

IPL 2021: ఐపీఎల్ బయో బబుల్ లో ఉన్నప్పటికీ భారత క్రికెటర్లు కొంతమందికి కోవిడ్ పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. వీరిలో ఎక్కువగా కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కి సంబంధించిన ఆటగాళ్ల ఉండడం గమనార్హం. ముందుగా చక్రవర్తి కి కోవిడ్ పాజిటివ్ వచ్చిన తర్వాత అతనితో పాటు మరో ఇద్దరికి కూడా వైరస్ సోకిందని తేలింది. ఇప్పుడు కొత్తగా ఈ లిస్ట్ లోకి మరో నైట్ రైడర్స్ జట్టు సభ్యుడు చేరాడు.

 

IPL 2021 prasiddh krishna tested positive for covid 19
IPL 2021 KKR logo

ఐపీఎల్ క్యాన్సిల్ చేశారు…. విదేశీ ఆటగాళ్లు తమ ఇళ్లకు తిరుగుముఖం పట్టారు. స్వదేశీయులు కూడా తమ స్వస్థలానికి చేరిపోయారు. అయితే కోల్కత్తా నైట్ రైడర్స్ ప్రధాన ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ కు కోవిడ్ పాజిటివ్ అని రిపోర్టు రావడం గమనార్హం. కొద్దిసేపటి క్రితమే అతనికి టెస్ట్ జరపగా రిపోర్టులో పాజిటివ్ అని తేలింది. దీనితో ఐపీఎల్ క్యాన్సిల్ చేయడం ఉత్తమమైన నిర్ణయం అని ఒప్పుకోవాల్సిందే. 

ఇక ప్రసిద్ధ్ కృష్ణ విషయానికి వస్తే అతను ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నాడు. నిన్న వరల్డ్ ఛాంపియన్షిప్ దాని తర్వాత ఇంగ్లాండ్తో జరిగే టెస్ట్ సిరీస్ కోసం సెలెక్ట్ చేసిన జట్టులో కృష్ణ రిజర్వ్ ఆటగాడిగా చోటు సంపాదించాడు. అలాగే మొన్న స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో అతను తొలిసారి భారత జాతీయ జట్టు తరపున కూడా ఆడాడు. 

మరి కొద్ది రోజులలో భారత జట్టు ఇంగ్లాండ్ ప్రయాణం అవనుండగా అతనికి పాజిటివ్ రావడం నిజంగా విచారకరం. మరి ఈ లోపల నెగటివ్ రిపోర్టు వచ్చి… అతను మిగిలిన వారితో కలిసి ఇంగ్లాండ్ ప్రయాణిస్తాడా లేకపోతే విడిగా ఇంగ్లండ్ కి చేరుకుంటాడా అన్న విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.


Share

Related posts

ఆర్‌టిసి కార్మికులకు జనసేనాని మద్దతు

somaraju sharma

వీడియో వైరల్: సింహాన్ని గాల్లోకి ఎత్తి పడేసిన దున్నపోతులు..!

Teja

స్కూల్స్ ఓపెన్ అయితే పిల్లలను పంపిస్తారా అంటే తల్లిదండ్రుల రియాక్షన్ ఇదే!

Yandamuri