NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

IPL 2021: పంజాబ్ లాంటి జట్టు ముంబై పై ఘన విజయం సాధించడానికి కారణం ఇదే..!

IPL 2021 Punjab Kings vs MI analysis

IPL 2021: ఐపీఎల్ చరిత్రలో ఐదు టైటిల్స్ గెలిచిన ముంబై జట్టు ఒకవైపు ఇప్పటి వరకు ఒకే ఒక్కసారి ఫైనల్స్ చేరి… అప్పుడు కూడా టైటిల్ గెలవకపోయిన పంజాబ్ కింగ్స్ మరొకవైపు. ఈ రెండు జట్లు ఈరోజు తలపడగా… పంజాబ్ కింగ్స్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ లో దాదాపు అన్నీ జట్ల బలాలు సమానమే. ఇది పెద్ద జట్టు… ఇది చిన్న జట్టు…. అని ఈరోజు వీరే కచ్చితంగా గెలుస్తారు అని అంచనా వేయడం కష్టం. 

 

IPL 2021 Punjab Kings vs MI analysis
IPL 2021 Punjab Kings vs MI match analysis

అయితే పంజాబ్ కింగ్స్ సాధించిన ఈ విజయం మాత్రం చాలా ప్రత్యేకం అనే చెప్పాలి. ఈరోజు మ్యాచ్ జరిగిన చెన్నై గ్రౌండ్ లో ముంబై ఇప్పటికే వరుసగా నాలుగు మ్యాచ్ లు ఆడింది. అందులో గెలిచిన రెండు మ్యాచ్ లలో చిన్న స్కోర్లు కాపాడుకున్నారు వారి బౌలర్లు. మరొకవైపు పంజాబ్ వారు గత రెండు మ్యాచ్ లలో 120 పరుగులు కూడా దాటలేకపోయారు. 

ఇలాంటి సమయంలో గెలుపు ముంబై తప్పక్ గెలుస్తుందని అందరూ అనుకున్నారు. అది కాకుండా పంజాబ్ కింగ్స్ బౌలింగ్ లైనప్ మరీ బలహీనంగా ఉంది. లోయర్ మిడిలార్డర్లో ఉన్నవారంతా అనుభవం లేని ఆటగాళ్ళు. అయితే పంజాబ్ జట్టు మాత్రం తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి.

గత సీజన్లలో పంజాబ్ వారు వరుసగా ఒక రెండు మ్యాచ్ లు ఓడిపోతే టీం కాంబినేషన్ మార్చేస్తూ ఉన్నారు. అశ్విన్ కెప్టెన్ గా ఉన్న సమయంలో అయితే లీగ్ దశ లో 14 మ్యాచుల్లో 14 డిఫెరెంట్ జట్లతో ఆడారు. గత సీజన్లో కూడా తరచుగా మార్పులు జరిగాయి. అంతేకాకుండా అటు ఇటుగా ఆడిన వారిని కూడా తీసివేస్తూ మిగతా వారిలో కాన్ఫిడెన్స్ దెబ్బతిని భయం పెరుగుతూ ఉండేది. 

కానీ ఈ సారి మాత్రం పంజాబ్ జట్టు మొదటి మూడు మ్యాచ్లకు ఒకే జట్టుని కొనసాగించింది. వారు గెలిచినది ఒక్క మ్యాచ్ అయినప్పటికీ ప్లేయర్ ఆత్మస్థైర్యం నిండిపోయింది. తర్వాత రెండు మ్యాచ్ లలో దాదాపు 22 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టి కొన్న ఇద్దరు ఆస్ట్రేలియన్ పేసర్లను పక్కనపెట్టి పంజాబ్ చెన్నై పిచ్ కి సరిపోయే కాంబినేషన్ తో ముందుకు వెళ్లారు. 

ఇది చాలా అనూహ్య నిర్ణయం. అంతేకాకుండా గత సీజన్లో క్రిస్ గేల్ మొదటి ఏడు మ్యాచ్ లలో బెంచ్ కే పరిమితం చేశారు. అయితే ఈ సారి మాత్రం డేవిడ్ మలాన్ రూపంలో ప్రపంచ నెంబర్ వన్ టీ20 బ్యాట్స్మెన్ వారికి అందుబాటులో ఉన్నప్పటికీ క్రిస్ గేల్ అనుభవానికే పెద్దపీట వేశారు. ఈ రోజు ముంబై మ్యాచ్లో తన అనుభవంతో గేల్ స్లో పిచ్ పైన ఎన్నడూ లేనివిధంగా నింపాదిగా అడి పంజాబ్ విజయతీరాలకు చేర్చాడు. 

తన కెరీర్లో ఒక గేల్ ఇంత మెల్లగా ఆడడం ఎవరూ చూసి ఉండకపోవచ్చు. సరైన నిర్ణయాలు తీసుకుని వారి తప్పులను అతి త్వరగా సరిదిద్దుకుంటే ఎంత పెద్ద ముంబై ఇండియన్స్ లాంటి జట్టు అయినా మట్టికరవాల్సిందే అని పంజాబ్ నిరూపించింది.

author avatar
arun kanna

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju