ట్రెండింగ్ న్యూస్

IPL 2021 : ఐపీఎల్ ముందు సన్రైజర్స్ కు భారీ దెబ్బ..! కెప్టెన్ వార్నర్ ఈ సీజన్ మొత్తం దూరం

Share

IPL 2021 : ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన క్రికెట్ లీగ్ ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) లో రెండు తెలుగు రాష్ట్రాల కి కలిపి ఏకైక స్థానిక జట్టు సన్రైజర్స్ హైదరాబాద్. తెలుగు ప్రజలంతా ఈ జట్టుకి తమ పూర్తి మద్దతు ప్రకటిస్తారు. అంతేకాకుండా ఈ జట్టు 2016 సంవత్సరంలో ఆస్ట్రేలియన్ స్టార్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్ సారధ్యంలో టైటిల్ కూడా సాధించింది. అప్పటినుండి ఈ జట్టుకి, అందులోని ఆటగాళ్లకు విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. 

 

IPL 2021 SRH warner out
IPL 2021 SRH warner out

అంతే కాకుండా ఇందులో ఆడే సభ్యులందరినీ కూడా తమ బంధువుల లాగా హైదరాబాద్ వారు ట్రీట్ చేస్తారు. ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ను రషీద్ భాయ్ అంటారు. న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ ను కేన్ మామ అంటారు. అలాగే సన్రైజర్స్ కెప్టెన్ ఆస్ట్రేలియన్ స్టార్ బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్ ను కూడా డేవిడ్ భాయ్ అంటారు. అందరిలో డేవిడ్ వార్నర్ కు తెలుగువారితో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. 

చాలా కాలం నుండి అతను తెలుగు హీరోల డైలాగ్స్ తో టిక్ టాక్ వీడియో లను చేస్తున్నారు. అలాగే తానే దగ్గరుండి ఎన్నో సార్లు జట్టుని సెమీస్ వరకు చేర్చాడు. అయితే ప్రస్తుతం రాబోయే ఐపీఎల్ సీజన్ కు డేవిడ్ వార్నర్ దూరం అవుతున్నాడు. ఇటీవల ఇండియా తో జరిగిన సిరీస్ లో ఫీల్డింగ్ చేస్తుండగా అతనికి గజ్జల్లో గాయం అయింది. దాంతో రెండో వన్డే మధ్యలోనే అతను వైదొలిగాడు. ఆ తర్వాత టి20 సిరీస్ కు దూరం అయ్యాడు. 

తర్వాత టెస్ట్ సిరీస్ లో పాల్గొన్నాడు కానీ పెద్దగా ప్రభావం చూపలేక పోయాడు. మళ్ళీ గాయం కావడంతో ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడు. గాయం కారణంగా అతను న్యూజిలాండ్ సిరీస్ కు కూడా దూరం కావలసి వచ్చింది. తాజాగా ఈ విషయంపై స్పందిస్తూ తాను వికెట్ల మధ్య పరిగెత్తలేకపోతున్నాను అని…. కనీసం బంతిని కూడా విసరలేకపోతున్నాను అని చెప్పాడు. తను కోలుకోవడానికి కనీసం ఆరు నుండి తొమ్మిది నెలల సమయం పడుతుందని వార్నర్ స్వయంగా వెల్లడించడం విశేషం. 

దీంతో మరో రెండు నెలల్లో జరగనున్న ఐపీఎల్ కు ఉచితంగా అందుబాటులో ఉండడని సమాచారం వచ్చేసింది. ఈ దెబ్బతో సన్రైజర్స్ హైదరాబాద్ గెలుపు అవకాశాలు మరింత క్లిష్టంగా మారాయి అనే చెప్పాలి.


Share

Related posts

Lakshmikanth Reddy: ప్రతి ఆటో డ్రైవర్ తెలుసుకోవాల్సిన స్టోరీ..IIM లో సీటు సంపాదించిన తెలంగాణ ఆటో డ్రైవర్ కొడుకు..!!

sekhar

బ్రేకింగ్ ! ఈశ్వరయ్య కేసులో హైకోర్టు సంచలన ఆదేశాలు

Vihari

ఈ లోపం ఉన్న వాళ్ళకి కరోనా వస్తే.. జాగ్రత్త సుమీ..! తాజా పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే..!!

Special Bureau
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar