NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ బిగ్ స్టోరీ

ఐపీఎల్ : ఢిల్లీ హాండ్స్అప్ : ముంబై 5వ సారి

 

సుమారు రెండు నెలలపాటు క్రికెట్ అభిమానుల్ని ఉర్రుత లుగించిన ఐపీఎల్ సీజన్ ఘనంగా ముగిసింది. కోవిడ్ సమయంలో సాయంత్రపు వినోదాల జల్లుకి విరామం వచ్చినట్లే. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ లో ముంబై సునాయస విజయం దక్కించుకుంది. మొదటిసారి ఫైనల్ వరకు చేరిన ఢిల్లీను చిత్తు చేసి 5వ సారి కప్పు కొట్టేసింది. ఫైనల్స్ లో ఢిల్లీ కనీస పోరాటం ఇవ్వలేకపోయింది.

జోరు కొనసాగించలేక..!!

ముంబై లాంటి బ్యాటింగ్ అయిన భారీ బాటింగ్ లైన్ అప్ ఉన్న టీంను ఎదుర్కోవాలంటే భారీ స్కోరు అవసరం. మొదట బాటింగ్ చేసిన ఢిల్లీ టీమ్ ఈ విషయంలో తడబడింది. స్టోనిస్, ధావన్, రహానే వికెట్లు వెనువెంటనే పడటం ఢిల్లీను దెబ్బతీసింది. ఓపెనర్లు భాగస్వామ్యం లేకపోవడం వల్ల మిడిల్ ఆర్డర్ పై ఒత్తిడి పెరుగుతుంది. ఢిల్లీ విషయంలో కూడా ఇదే జరిగింది. మూడు వికెట్లు వెనువెంటనే పడిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వికెట్-కీపర్ రిషబ్ పంత్ లు చక్కటి ఇన్నింగ్స్ ఆడారు. 4వ వికెట్ కు 80 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పారు. ఇద్దరు అర్ధ సెంచరీలు చేసి ఫామ్ లో కొనసాగుతున్న సమయంలో పంత్ అవుట్ అవ్వడంతో సుమారు 8 రన్ రేట్ పైనే ఉన్న ఢిల్లీ టీమ్ చతికిల పడింది. అప్పటివరకు ఒక వికెట్ కోసం శ్రమించిన ముంబై బౌలర్లకు అవకాశం చిక్కింది. డెత్ ఓవర్లలో పట్టు బిగించారు. బూమ్రా బోల్ట్ వంటి బౌలర్లకు రెండు ఓవర్లు మిగిలి ఉండటంతో తో వారిని ఎదుర్కోవడం ఢిల్లీ లోయర్ ఆర్డర్కు కష్టతరమైంది. ఫలితంగా 180 నుంచి 200 మధ్యలో స్కోర్ వస్తుంది అని ఊహించిన ఢిల్లీ అభిమానుల కల తీరలేదు. 157 రన్స్ మాత్రమే సాధించి ముంబై కు స్వల్ప టార్గెట్ ఇవ్వడం తో వారి కి చేదన సులభతరమైంది.

వికెట్లు తీయలేక!!

ముంబై లాంటి గట్టి బ్యాటింగ్ లైన్ అప్ ఉన్న టీమును ఛేజింగ్ విషయంలో కట్టడి చేయాలంటే వెనువెంటనే వికెట్లు తీయడం ముందున్న లక్ష్యం. దీన్ని ఢిల్లీ బౌలర్లు అందిపుచ్చుకో లేకపోయారు. కీపర్ డికోక్ వికెట్ 5 ఓవర్లో తీసినా, అప్పటికే డికోక్ చేయాల్సిన నష్టం చేసి వెళ్ళిపోయాడు. 3 సిక్స్ లు, 2 ఫోర్లతో 30 పైగా రన్స్ సాధించాడు. స్కోర్ బోర్డ్ మీద 10 రన్ రేట్ పైనే సాధించి ఔట్ అయ్యాడు. తర్వాత క్రీజ్ లోకి వచ్చిన సూర్యకుమార్, కిషన్ దీన్ని కొనసాగించారు. కెప్టెన్ రోహిత్ చివరి గేమ్ లో ఫామ్ లోకి వచ్చి నిలకడగా ఆడి 68 రన్స్ సాధించడం ముంబై కు అదనపు మైలేజ్ ఇచ్చింది. లక్ష్యం చిన్నదై పోతున్న సమయంలో ముంబై బ్యాట్స్ మెన్స్ వికెట్స్ వరుసగా పడ్డాయి. రోహిత్ శర్మ, పొలార్డ్ , పాండ్య వెంటనే పెవిలియన్ చేరారు. అయితే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇదే వికెట్లను ఢిల్లీ బౌలర్లు ముందు తీసి ఉంటే మ్యాచ్ పై పట్టు సాధించే వారు. మ్యాచ్ కూడా ఎంతో ఆసక్తికరంగా సాగేది.

సమష్టి తత్వమే లోపించింది!!

ఢిల్లీ ఓటమికి అనేక కారణాలు వెతికి న, గట్టు లో ముఖ్యంగా సమష్టి తత్వం లేకపోవడమే వారి ఓటమికి కారణంగా చెప్పుకోవచ్చు. టాపార్డర్ కీలకమైన సమయంలో రాణించక పోవడం ఒక ఎత్తయితే మిడిలార్డర్లో వచ్చిన వారు అందించిన భారీ స్కోర్ బాధ్యతలు మిగిలినవారు అందిపుచ్చుకోవడం మైనస్. ముఖ్యంగా బౌలింగ్ విషయంలో పటిష్టంగా ఉన్న ముంబై బౌలర్లు పై ఎదురు దాడి చేసేందుకు ఢిల్లీ బ్యాట్స్మెన్ తంటాలు పడ్డారు. మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్ రిషబ్ పంత్ ఆడిన తరహా ఆటను మిగిలినవారు కొనసాగించలేకపోయారు. ఇది మరో లోపం. ముఖ్యంగా బౌలింగ్ విషయంలో ఢిల్లీ పూర్తిగా చతికిల పడిందనే చెప్పాలి. ఫైనల్ మ్యాచ్లో పర్పుల్ క్యాప్ విన్నర్ రబడ సైతం ఎలాంటి ప్రభావం చూపలేక పోయాడు. నొర్ట్ జా భారీగా పరుగులు ఇచ్చాడు. స్పిన్నర్లు రన్స్ కట్టడి చేయలేకపోయారు. వికెట్లు పడటం లేదు అని అర్ధం అయ్యాక రన్ రేట్ తగ్గించే పటిష్టమైన బౌలింగ్ వేయలేకపోయారు. ఇది ప్రణాళిక లోపమే. కెప్టెన్ అయ్యర్ ముంబై బ్యాట్సమెన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ, ప్లాన్ లేకుండానే బరిలోకి దిగినట్లు అర్థం అవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే కర్ణుడి చావుకు వంద కారణాల్లా కనిపించినా, ముంబై 6వ సారి కప్పు కొట్టడంలో మాత్రం నిలకడగా రాణించింది అని చెప్పాలి.

author avatar
Special Bureau

Related posts

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju