NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

ఐపీఎల్ స్పెషల్ ; ఢిల్లీకి ఉందోయ్ అవకాశం..! ఇవి అధిగమిస్తే చాలు..!!

 

13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ఫైనల్ వరకు వచ్చిన ఢిల్లీ టీం కప్పు సాధించాలంటే బలమైన ముంబై టీంను ఎదుర్కోవాలి. ఈ రోజు జరిగే ఐపీఎల్ ఫైనల్ కోసం ఢిల్లీ టీమ్ అందుకు సిద్ధం అవుతుందా కప్పును ఎగరేసుకుపోయే సత్తా ఢిల్లీకి ఉందా? ముంబై లాంటి పటిష్టమైన బ్యాటింగ్ బౌలింగ్ లైనప్ ఉన్న జట్టును ఢీకొట్టి నెగ్గాలంటే అంటే ఢిల్లీ ఏం చేయాలి? అసలు ఢిల్లీ కు అలాంటి సమర్ధత ఉందా అంటే 100 శాతం ఉంది అని చెప్పాలి. ఐతే వారు సమష్టి గా రాణించడమే ఇప్పుడు కావాల్సింది.

 

మొదట బలంగా… తర్వాత బలహీనంగా!!

ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు యువకులతో నిండి, వరుస విజయాలతో దూసుకుపోయింది. ఒక దశలో 14 పాయింట్స్ సాధించి పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలోకి వెళ్ళింది. అయితే తర్వాత జట్టులో గాడి తప్పింది. బాటింగ్, బౌలింగ్ లో నిలకడ లేమితో వరుస వైఫల్యాలను మూట కట్టుకుని ప్లే ఆఫ్ సంక్లిష్టం చేసుకుంది. చివరికి తేరుకుని ప్లే ఆఫ్ చేరినా మొదటి నాకౌట్లో ముంబై చేతిలో చిత్తుగా ఓడి మళ్ళీ హైదరాబాద్ పై విజయంతో తొలిసారిగా ఫైనల్ చేరుకుంది. ఈ జర్నీలో ఢిల్లీ టీమ్ లో ఎన్నో లోపాలు కనిపోయిస్తాయి. ముఖ్యంగా సమష్టి తత్వం లోపించడం ఢిల్లీ కు శాపంగా మారింది. ఆడితే అంతా బాగా ఆడుతూ, లేకుంటే మొత్తం నిరాశలోకి వెళ్తున్నారు. ముఖ్యంగా యువకులు అనుకున్నంత రాణించాలేకపోవడం పెద్ద లోపం. శిఖర్ ధావన్ ఆడితేనే పెద్ద స్కోర్ వెళ్లేలా కనిపిస్తోంది. లేకుంటే మొత్తం బాటింగ్ లైన్ అప్ పెవిలియన్ కు వెంటనే వచ్చేస్తుంది. అండర్ 19 విభాగంలో అదరగొట్టిన పృద్వి షా కు ఢిల్లీ ఓపెనర్ గా ఎన్ని అవకాశాలు ఇచ్చిన ఫామ్ లోకి రాలేకపోయాడు. రిషిబ్ పంత్ ది అదే ధోరణి. కెప్టెన్ శ్రేయస్ రెండు మ్యాచ్ లలో అదరగొట్టిన తర్వాత కనీసం రెండు అంకెల స్కోర్ చేయలేక పోతున్నాడు. ముఖ్యంగా చెధనలో ఢిల్లీ టీమ్ తేలిపోతుంది. బౌలింగ్ లో రబడా, నోర్ట్ జా లాంటి ఫాస్ట్ బౌలర్లు నిలకడగా రాణించడం, కొన్నిసార్లు రబడ మ్యాచ్ విన్నింగ్ బౌలింగ్ ప్రదర్శన ఢిల్లీకి కలిసి వస్తున్నాయి. నొర్ట్ జా మంచి సహకారం అందించడం ఢిల్లీ కి కలిసొచ్చే అంశాలు. ఐతే స్పిన్నర్ గా అక్షర్ పటేల్, అశ్విన్ రవి ఇద్దరు ఆఫ్ స్పిన్నర్లు కావడంతో ఒక్కోసారి స్పిన్నర్ విషయంలో బౌలింగ్ గతి తప్పుతోంది. ఒక మంచి లెగ్ బ్రేక్ బౌలర్ ఉండి ఉంటే ఢిల్లీ టీమ్ సమతుకం సరిపోయేది.

 

నేడు గెలవాలంటే…

పటిష్టమైన ముంబై టీం ఢిల్లీ ఓడించాలంటే పక్కా ప్రణాళిక అవసరం. నేటి ఫైనల్లో దీన్ని ఢిల్లీ టీం అనుసరించాలి. మంచి ఫామ్ లో ఉన్న స్టోనిస్ ను గత మ్యాచ్ లో ఓపెనింగ్ కు పంపడం ఒక మంచి పరిణామం. ఫామ్ లో లేని పృథ్వి షాను పక్కన పెట్టడం మంచిది అయ్యింది. అయితే యువకులు సమష్టిగా రాణిస్తే ముంబై ని ఎదుర్కోవడం పెద్ద కష్టమేమీ కాదు. ముంబై ఫాస్ట్ బౌలింగ్ లో బూమ్రా, బౌల్ట్ లను జాగ్రత్తగా ఎదుర్కోవడానికి పక్క స్కెచ్ తో సిద్ధం అయితే మంచి స్కోర్ సాధించవచ్చు. బాటింగ్ లోను బలంగా ఉన్న ముంబైను కట్టడి చేసేందుకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తే మేలు. అలాకాకుండా వికెట్లు తీసేందుకు బౌలింగ్ లయ తప్పితే ముంబై బ్యాట్సమెన్ ఢిల్లీను ఒక ఆట ఆడుకుంటారు. కోచ్ రిక్కి పాయింటింగ్ దీని కోసం ఎలాంటి వ్యూహం సిద్ధం చేస్తారు అనేది ఆసక్తికరమైన అంశం. పాంటింగ్ గతంలో ముంబై టీమ్ లో పని చేసిన అనుభవం ఉంటడంతో ఆ టీమ్ బలాబలాలు పాంటింగ్ కు తెలుసు… దీన్ని అందిపుచ్చుకుని ఒక పక్కా విజయ వ్యూహం తయారుచేసి, అమలు చేస్తే ఢిల్లీ ఐపీఎల్ కప్పు ను ఎగరేసుకుపోవడం ఖాయం..

 

author avatar
Special Bureau

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju