NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AB Venkateswararao: పదవీ విరమణ చేసిన సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు .. చివరి రోజు సంచలన వ్యాఖ్యలు

AB Venkateswararao: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ హోదాలో పదవీ విరమణ చేశారు. విజయవాడ ముత్యాలంపాడులోని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు ఏబీవీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ఉదయం ఆయన బాధ్యతలు స్వీకరించగా.. సాయంత్రం పదవీ విరమణ చేశారు. పోలీస్ శాఖ పరంగా ప్రస్తుతం డీజీ హోదాలో ఉన్నారు ఏబీ వెంకటేశ్వరరావు, ఏబీవీని కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి తదితరులు ఉన్నారు.

పూర్తి సంతృప్తితో పదవీ విరమణ చేస్తున్నా

పదవీ విరమణ సందర్భంగా ఏబీ వెంకటేశ్వరరావు సంచలన కామెంట్స్ చేశారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తాను తొలుత టాటా మోటార్స్ లో ఉద్యోగంలో చేరానన్నారు. అదే సంస్థలో కొనసాగినా, లేక అమెరికా వెళ్లినా ఇప్పుడు తన జీవితం వేరే విధంగా ఉండేదన్నారు. ఐపీఎస్ గా సర్వీసులో ఉన్నన్ని రోజులు నీతి.. నిజాయితీతో పని చేశానన్నారు. పూర్తి సంతృప్తితో పదవీ విరమణ చేస్తున్నానని పేర్కొన్నారు.

వృత్తి రీత్యా ఎంతో మందిని చూశాననీ, తాను చేసిన పోరాటం చూసి ఎన్నో లక్షల మంది స్పందించారని ఏబీవీ అన్నారు. వారందరికీ రుణపడి ఉంటానన్నారు. తన బాధ, పోరాటం, నిజాయితీ ఎంతో మందికి దగ్గర చేశాయన్నారు. ఇవేళ వృత్తి రీత్యా మాత్రమే రిటైరవుతున్నాననీ, చివరి శ్వాస వరకు అన్యాయాన్ని ఎదురిస్తూనే ఉంటానని, బాధితుల తరపున పోరాడుతూనే ఉంటానని పేర్కొన్నారు.

Related posts

శ్రీ ఎం ఆశ్రమంలో శ్రీ గురు మహావతార్ బాబాజీ ఆలయ గ్రాండ్ ఓపెనింగ్ 

Deepak Rajula

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N