IPS Transfers: ఏపిలో 13 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రకాశం జిల్లా ఎస్పీగా మాలికా గార్గ్, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా రాహుల్ దేవ్ శర్మ, రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీగా ఐశ్వర్య రస్తోగి, జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీగా డా.షీముషి, అక్టోపస్ ఎస్పీగా డా. కోయ ప్రవీణ్, ఏపిఎస్పీ విజయనగరం బెటాలియన్ కమాండెంట్ గా విక్రాంత్ పాటిల్, మంగళగిరి డీజీపీ కార్యాలయంలో శాంతి భద్రతల ఏఐజీగా ఆర్ ఎన్ అమ్మిరెడ్డి విజయవాడ రైల్వే ఎస్పీగా రాహుల్ దేవ్ సింగ్, కాకినాడ మూడో బెటాలియన్ కమాండెంట్ గా గరుడ్ సుమిత్ సునీల్, విశాఖ డీసీపీ – 1 గా గౌతమీ శాలి, ఇంటెలిజెన్స్ ఎస్పీగా జిందాల్, మంగళగిరి ఆరో బెటాలియన్ కమాండెంట్ గా అజితా వేజండ్ల లు బదిలీ అయ్యారు. ఇక నారాయణ్ నాయక్ ను డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.