NewsOrbit
న్యూస్

IPS : భార్య ఐపీఎస్ అయితే నాకేంటి ?ఓ భర్త బరితెగింపు!అసలేం జరిగిందంటే !!

IPS : ఆమె ఒక ఐపీఎస్ ఆఫీసర్. సమాజంలో మహిళలకు అన్యాయం జరిగితే వారికి న్యాయంచేసే అధికారం చేతిలో ఉన్న వ్యక్తి.

irregular behaviour of women ips officers husband
irregular behaviour of women ips officers husband

కానీ ఆమెకే అన్యాయం జరిగితే ఎవరికి చెప్పుకుంటుంది.సాధారణ మహిళలా అత్తమామలు, భర్త పెట్టే కష్టాలను భరించింది. సగటు భారతీయ స్త్రీలాగా, కుటుంబ గౌరవం కోసం, తాళి కట్టి, అగ్ని సాక్షిగా ఏడడుగులు నడిచిన భర్త కోసం తన కాపురం నిలబడాలని అన్నీ భరించింది. సహనం కోల్పోయిన ఆమె చివరికి బెంగుళూరులోని కబ్బన్ పార్క్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

IPS : ఇదీ ఆ పోలీస్ అధికారిణి దయనీయ గాథ!

ఉత్తర ప్రదేశ్ కు చెందిన 2009 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణి వర్తికా కటియార్(34) బెంగుళూరు పోలీసు ప్రధాన కార్యాలయంలోని కెఎస్‌ఆర్‌పి రీసెర్చ్ సెంటర్‌లో సూపరింటెండెంట్‌గా పని చేస్తున్నారు. ఆమెకు 2011 లో ఐఎఫ్ఎస్ అధికారి నితిన్ సుభాష్ యోలా తో మహారాష్ట్రలోని భుసావల్ లో వివాహం అయ్యింది.భర్త ఢిల్లీలోని దేశాంగ మంత్రిత్వ శాఖలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. తన భర్త నితిన్, అతని కుటుంబం చేతిలో సంవత్సరాల తరబడి ఆర్థిక, మానసిక, శారీరక వేధింపులకు గురయ్యానని ఆరోపిస్తూ ఫిబ్రవరి 1వ తేదీన ఆమె కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు.

IPS : ధన పిశాచులు వాళ్లు!

2011 లో తమ వివాహం జరిగిందని.. పెళ్లి సమయంలో ఖర్చులన్నీ తన కుటుంబమే భరించిందని ఆమె తెలిపారు.  అయితే, పెళ్లి అయిన తర్వాత నుంచి బంగారు ఆభరణాలు కావాలని.. అదనపు కట్నం కావాలని డిమాండ్ చేస్తూ ….తనను అత్యంత దారుణంగా మానసికంగా, శారీరకంగా నితిన్, అతని కుటుంబ సభ్యులు వేధింపులకు గురి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.పెళ్లి అయ్యినప్పటి నుంచి ఇప్పటి వరకూ అనేకసార్లు తన పుట్టింటి నుంచి లక్షలాది రూపాయలను అదనపు కట్నంగా డిమాండ్ చేసి తీసుకున్నారని ఆమె వివరించారు. పెళ్లి జరిగిన మూడు నెలల్లోపే రూ.3 లక్షలు అదనంగా ఇవ్వకపొతే మీ అమ్మాయిని వదిలేస్తానని తన తల్లిదండ్రులను బెదిరించి మరీ డబ్బులు తీసుకున్నారని వర్తికా తెలిపారు.తనను అల్లుడు ఎక్కడ వదిలేస్తాడో అనే భయంతో, తన కాపురం బాగుండాలని…భర్త, నితిన్ కుటుంబ సభ్యులు అడిగిన డిమాండ్స్ ను తన తల్లితండ్రులు తీరుస్తూ వస్తున్నారని ఆమె ఫిర్యాదులో తెలిపారు. అంతేకాదు 2012 లో ఉత్తర ప్రదేశ్ లోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లి అక్కడ డబ్బులు డిమాండ్ చేస్తే వారు రూ. 5లక్షల రూపాయలను చెక్ రూపంలో ఇచ్చారని తెలిపారు వర్తిక. ఇంటి కొనుగోలు కోసం రూ.35 లక్షలు తీసుకున్నారని….డబ్బు కోసం మానసికంగా, శారీరకంగా, తనను హింసించారని ఆ ఫిర్యాలో పేర్కొంది.

భర్త హింసలు అన్నీ ఇన్నీకాదట!

2016 లో కొలంబో పర్యటనకు వెళ్లిన సమయంలో తన భర్త నితిన్ తనను కొడితే అప్పుడు చేయి కూడా విరిగిందని ఆరోపించారు. ఒక ఏడాది దీపావళి కానుక ఇవ్వలేదని విడాకులిస్తానని బెదిరించాడని ఆమె తెలిపారు. తాను గర్భవతి గా ఉన్న సమయంలో కూడా శారీరకంగా హి౦సించడం మానలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో కర్ణాటక ఐఎఫ్ఎస్ అధికారి భర్త నితిన్ కాకుండా మరో ఆరుగురు కుటుంబ సభ్యులను సహ నిందితులుగా వర్తికా పేర్కొన్నారు. అతని తండ్రి సుభాష్ యెయోలా, తల్లి అమోల్ యెయోలా, బంధువులు సునీతా యోలా, సచిన్ యెయోలా, ప్రజక్త యోలా, ప్రద్న్య యోలా నిందితులుగా పేర్కొన్నారు.వర్తికా ఫిర్యాదుతో వరకట్నం నిషేధ చట్టం యొక్క సెక్షన్ 3, 4 .. ఐపీసీ లోని 498A, 506, 509,34, 384,420. 326, సెక్షన్ల కింద ఆ ఏడుగురిపై కేసు నమోదు చేశారు.

 

author avatar
Yandamuri

Related posts

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju