NewsOrbit
న్యూస్

నిమ్మగడ్డ కి తిరుగులేని షాక్ ఇచ్చిన గవర్నర్?

CM Jagan VS Nimmagadda ; What Will happen?

నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఏ ముహూర్తాన్న నియమితులయ్యారో.. ఆయనను ఏపీ ప్రభుత్వం ఏ ముహూర్తాన్న తొలగించే చర్యలకు ఉపక్రమించిందో తెలియదు కానీ… నాటి నుంచి ప్రతీ రోజూ క్లైమాక్స్ లా నడుస్తోంది ఈ వ్యవహారం! హైకోర్టు, సుప్రీంకోర్టు ల అనంతరం తాజాగా హైకోర్టు తాజా తీర్పుతో ప్రస్తుతం నిమ్మగడ్డ ఫైల్.. గవర్నర్ చేతిలోకి చేరింది. ఈ సమయలో ఇక నిమ్మగడ్డ నియామకం లాంచనమే అన్న కథనాలు వస్తోన్న తరుణంలో… ఒక షాక్ తగిలింది!
CM Jagan VS Nimmagadda ; What Will happen?
మాములుగా అయితే ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వానికీ – ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు మధ్య ఇష్యూ! దీనిలో కోర్టులను ఆశ్రయించడం.. తీర్పులపై పైకోర్టులకు వెళ్లడం మాత్రమే జరిగేది. కానీ.. దీన్ని రాజకీయ సమస్య, ప్రజా సమస్యగా చేసే క్రమంలో టీడీపీ నేతలు దీన్ని తమ ప్రిస్టేజ్ సమస్యగా భావించేశారు! వారి సంగతి అలా ఉంటే… తానేమన్నా తక్కువ తిన్నాన్నా అన్నట్లుగా… రాజకీయ నాయకులతో రహస్య భేటీల పర్వానికి తెరలేపారు నిమ్మగడ్డ. దీంతో.. ఇంతకాలం ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నవారు సైతం.. నిమ్మగడ్డ వ్యవహారశైలిపై నెగిటివ్ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు!

ఈ క్రమంలో ఇప్పటికే ఈ అంశం సుప్రీం కోర్టులో ఉన్నా కూడా… మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు నిమ్మగడ్డ. వెళ్లి గవర్నర్ ని కలవమని కోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో మరో మారు నిమ్మగడ్డకు షాకిచ్చింది ప్రభుత్వం… “ఇప్పటికే సుప్రీంకోర్టులో ఈ అంశం పై పిటీషన్ దాఖలు చేసామని, అది అమలులో ఉండగానే హైకోర్టులో దిక్కారణ పిటీషన్ వేసారని.. దీనిపై హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని.. హైకోర్టు ఆదేశాలు అమలు చేస్తే తమ పిటీషన్ నిరర్ధకం అవుతుందని అంటూ.. సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది ఏపీ సర్కార్! అవన్నీ ఒకెత్తు అయితే… గవర్నర్ ను కలిసిన నిమ్మగడ్డ కు రాజ్ భవన్ నుంచి షాక్ తగిలిందని అంటున్నారు!

ఇక అంతా అయిపోయింది… ఇక ఎస్.ఇ.సి. కుర్చీ ఎక్కేసి.. నచ్చిన వారిని ఉంచుకుని, నచ్చని వారిని తొలగించేలా.. అది కూడా ఒకటి రెండు రోజుల్లో ఆ స్థానే కొత్త వారిని నియమించుకునేలా.. స్కెచ్ వేసుకున్న నిమ్మగడ్డాకు… తన మౌనంతో సమాధానం చెప్పారంట గవర్నర్!! నిమ్మగడ్డ విషయంలో విన్నంతా విని… మౌనంగానే “బాయ్” చెప్పారని తెలుస్తోంది!! దీంతో… నిమ్మగడ్డకు ఇది భారీ షాక్ అని అంటున్నారు విశ్లేషకులు!! ఆ సంగతి ఒకెత్తు అయితే… గవర్నర్ తో భేటీ అనంతరం బయటకొచ్చిన నిమ్మగడ్డ… గవర్నర్ సానుకూలంగా స్పందించారని చెప్పడం కొసమెరుపు!!

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!