NewsOrbit
న్యూస్ సినిమా

పూరి జగన్నాధ్ – బాలయ్య కాంబోలో వచ్చేది చారిత్రాత్మకమా .. పూరి రాసిన 7 కథల్లో ” గోన గన్నారెడ్డి ” ..?

Share

పైసా వసూల్ కాంబినేషన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది నందమూరి బాలకృష్ణ – డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ల క్రేజీ కాంబినేషనే. అసలు ఈ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని గాని.. వచ్చిన సినిమా ఇంత హిట్ అవుతుందని గాని ఎవరూ అనుకోలేదు. అయితే పైసా వసూల్ చేసినప్పటి నుంచి బాలయ్య.. పూరి జగన్నాధ్ లకి ఒకరంటే ఒకరికి ఇష్టం .. ప్రేమ పెరిగిపోయింది. పైసా వసూల్ మేకింగ్ స్టైల్ చూశాక బాలయ్య వెంటనే మళ్ళీ పూరి డైరెక్షన్ లో సినిమా చేయాలనుకున్నాడు.

After Fighter - Puri Jagannadh To Collaborate With Balakrishna For His Next?

ఇదే విషయాన్ని పూరి కూడా చెప్పుకొచ్చాడు. అయితే ఇద్దరు వేరే సినిమాలతో బిజీ అయ్యారు. పూరి.. విజయ్ దేవరకొండ తో ఒక సినిమా చేస్తుండగా బాలయ్య గతంలో తనకి మంచి మాస్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. మరోవైపు కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీకి ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు బాలయ్య కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్ చేసేందుకు దర్శకులని.. ప్రాజెక్ట్స్ ని లైనప్ చేసి పెట్టుకుంటున్నాడు.

అయితే లాక్ డౌన్ లో పూరి దాదాపు 7 కథ ల వరకు రాశాడని నిర్మాత ఛార్మి చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అందులో ఒక కథ బాలయ్య కోసమే అన్న ప్రచారం తో పాటు త్వరలో ఈ ఇద్దరు కలిసి సినిమా చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా వస్తున్న వార్తలను బట్టి పూరి మొదటిసారి ఒక చారిత్రాత్మక కథ తో సినిమా చేయబోతున్నట్టు అది కూడా బాలయ్య తో అని తెలుస్తుంది.


Share

Related posts

మూడేళ్లలో విద్యారంగ అభివృద్ధికి రూ.53వేల కోట్లు ఖర్చు .. ప్రభుత్వంపై కడుపుమంటతోనే తప్పుడు ప్రచారాలు అంటూ విపక్షాలపై మరో సారి ధ్వజమెత్తిన సీఎం వైఎస్ జగన్

somaraju sharma

కేసీఆర్‌పై ఢిల్లీ స్కెచ్… రేవంత్ రెడ్డి కొత్త ప్లాన్‌

sridhar

Payal Rajput Yellow Dress Pictures

Gallery Desk