RRR: ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాల దెబ్బకి ఆచార్య వెనక్కి తగ్గుతున్నాడా..? ప్రస్తుతం ఇదే మాట టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. రెండు సినిమాలు భారీ స్థాయిలో రూపొందుతున్నాయి. ఆచార్య కూడా ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలకి ఏమాత్రం తగ్గకుండా రూపొందుతోంది. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాం చరణ్ కాంబినేషన్ అనగానే అసాధారణమైన అంచనాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఒకవైపు ఆర్ఆర్ఆర్ కూడా భారీ మల్టీస్టారర్ గా రూపొందుతోంది. మెగా పవర్ స్టార్ రాం చరణ్ – యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోలుగా, బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, అజయ్ దేవగన్ నటిస్తున్నారు.
అంతేకాదు బ్రిటన్ మోడల్ ఓలివియా మోరీస్ సహా పలువురు బాలీవుడ్, కోలీవుడ్ హాలీవుడ్ ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ పాన్ ఇండియన్ సినిమా కోసం కొన్ని కోట్ల కళ్ళు ఎదురు చూస్తున్నాయి. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న పుష్ప సినిమా మీద భారీ అంచనాలున్నాయి. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా 5 భాషలలో విడుదల కానుండటం విశేషం అయితే ఆర్ఆర్ఆర్ 10 భాషలలో విడుదల కాబోతుండటం మరో గొప్ప విశేషం. కానీ ఆచార్య మాత్రం ఇప్పటి వరకు ఒక్క భాషలోనే అని తెలిసింది.
RRR: ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలతో ఆచార్య పోటీ లేకుండా చూసుకుంటున్నారట.
అందుకే ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలతో ఆచార్య పోటీ లేకుండా చూసుకుంటున్నారట. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాను అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లో అదే డేట్‌కి రిలీజ్ చేయడానికి రాజమౌళి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక పుష్ప క్రిస్మస్ కానుకగా డిసెంబర్లో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. సంక్రాంతి బరిలో ఇప్పటికే ప్రభాస్ రాధే శ్యాం, పవన్ కళ్యాణ్ – రానాల భీంలా నాయక్, మహేష్ సర్కారు వారి పాట, వెంకీ – వరుణ్ తేజ్‌ల ఎఫ్ 3 ఉన్నాయి. దాంతో ఆచార్య సోలో డేట్ ఎప్పుడు లాక్ చేయాలో అని పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నారట. త్వరలో దీనిపై ఓ క్లారిటీ రానుందని సమాచారం.