Adi sai kumar: సాయి కుమార్ కొడుకు ఆది సాయి కుమార్‌కి ఇండస్ట్రీ సపోర్ట్ సరిపోవడం లేదా..?

Share

Adi sai kumar: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా సౌత్ లోని తమిళ, కన్నడ సహా మిగతా భాషలలోనూ బాగా పాపులర్ అయిన సీనియర్ నటుడు సాయి కుమార్. హీరోగా సాయి కుమార్‌కి డైలాగ్ కింగ్ అనే పేరున్న సంగతి తెల్సిందే. అంతేకాదు ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గాను సాయి కుమార్‌కి సౌత్ సినిమా ఇండస్ట్రీలలో విపరీతమైన క్రేజ్ అండ్ పాపులారిటీ ఉంది. సాయి కుమార్ తండ్రి అయ్యప్ప పి శర్మ కూడా నటుడిగా ఎంతో పాపులరిటీ సాధించారు. ఇక సాయి కుమార్ తమ్ముళ్ళు కూడా నటులుగా, డబ్బింగ్ ఆర్టిస్టులుగా ఎంతో పాపులర్.

is-adi-sai-kumar-getting-enough-support-from-industry
is-adi-sai-kumar-getting-enough-support-from-industry

అంత పాపులర్ నటులు, డబ్బింగ్ ఆర్టిస్టులు ఉన్న ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు ఆది సాయి కుమార్. బి జయ దర్శకత్వంలో వచ్చిన ప్రేమ కావాలి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన లవ్ లీ సినిమా కూడా ఈ యంగ్ హీరోకి మంచి పేరు తీసుకు వచ్చింది. అలాగే సుకుమారుడు సినిమా వచ్చి యావరేజ్ హిట్ గా నిలిచింది. ఇలా పెద్దగా గ్యాప్ లేకుండా ఆది సాయి కుమార్ వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. కానీ అటు కమర్షియల్ హీరోగా గానీ ఇటు క్లాస్ హీరోగా గానీ స్టార్ ఇమేజ్ దక్కడం లేదు.

Adi sai kumar: ఆది సాయి కుమార్‌కు వరుసగా సినిమా అవకాశాలు రావడం అంటే మంచి సపోర్ట్ ఉన్నట్టే లెక్క.

మాస్ ఇమేజ్ దక్కించుకోవాలని తాపత్రయంతో ఆది సాయి కుమార్ గరం, రఫ్ అనే సినిమాలు చేశాడు. కాని ఈ రెండు సినిమాలు ఈ హీరోకి తీవ్ర నిరాశనే మిగిల్చాయి. మాస్ కథలను ఎంచుకొని బాగానే కష్టపడినా ఆదికి మాత్రం ఒక్క హిట్ కూడా దక్కలేదు. దాంతో చుట్టాలబ్బాయి అనే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీలో నటించాడు. ఈ సినిమా కూడా ఆయనకి హిట్ ఇవ్వలేకపోయింది. శ్రీకాంత్ మాదిరిగా ఫ్యామిలీ హీరో అనే పేరు తెచ్చుకోవాలని ఆది ప్లాన్స్ బాగానే వేస్తున్నాడు. కానీ అవి ఏమాత్రం వర్కౌట్ అవడం లేదు.

 

శమంతకమణి, నెక్స్ట్ నువ్వే లాంటి థ్రిల్లర్ జోనర్ సినిమా కథలను ఎంచుకొని ఆ రకంగా అయినా ఓ సాలీడ్ హిట్ అందుకోవాలని ట్రై చేశాడు. ఈ సినిమా కథ, కథనాల పరంగా బాగానే ఉన్నాయని ప్రేక్షకులు మాట్లాడుకున్నప్పటికి ఫైనల్‌గా మాత్రం ఆది ఖాతాలో హిట్ చేరలేదు. ఆ తర్వాత జోడీ, ఆపరేషన్ గోల్డ్ ఫిష్, శశి లాంటి చిత్రాలు కూడా ఆది వరుసబెట్టి చేశాడు. కానీ హిట్ అనే మాట ఒక్కదానికి దక్కలేదు. ఒకరకంగా చెప్పాలంటే బాక్సాఫీస్ వద్ద అంత
గొప్ప మార్కెట్ లేకపోయినా ఆది సాయి కుమార్‌కు వరుసగా సినిమా అవకాశాలు రావడం అంటే మంచి సపోర్ట్ ఉన్నట్టే లెక్క.

Adi sai kumar: ఇండస్ట్రీ వారి లెక్కలో మాత్రం ఆది స్టార్ హీరో అనే పేరు తెచ్చుకోలేకపోతున్నాడు.

కానీ జనాల, ఇండస్ట్రీ వారి లెక్కలో మాత్రం ఆది స్టార్ హీరో అనే పేరు తెచ్చుకోలేకపోతున్నాడు. అయినా కూడా ఈ యంగ్ హీరో చేతిలో ఇప్పుడు 5 సినిమాలున్నాయి. వీటిలో డిఫరెంట్ జీనర్ సినిమాలతో పాటు లవ్ స్టోరీ, మాస్ ఎంటర్‌టైనర్ చిత్రాలున్నాయి. “తీస్ మార్ ఖాన్” అనే మాస్ ఎంటర్‌టైనర్ మూవీతో ఎలాగైనా ఈసారి భారీ కమర్షియల్ హిట్ దక్కించుకోవాలని తెగ కష్టపడుతున్నాడు. ఇటీవలే ఈ మూవీ ఫస్ట్ లుక్ కూడా రిలీజై బాగానే ఆకట్టుకుంది. చూడాలి మరి ఆది సాయి కుమార్ ఈ సినిమాలతోనైనా ఓ రెండు భారీ హిట్స్ అందుకొని తను ఆశపడుతున్న మాస్ హీరో ఇమేజ్ తెచ్చుకుంటాడో లేదో.

 


Share

Related posts

Pavan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా.. రీక్రియేట్ తో అదరగొట్టారు కుర్రాళ్ళు..!!

bharani jella

బిగ్ బాస్ 4 : అఖిల్ నిజంగానే అంత డబ్బు నష్టపోయాడా..! అతని రెమ్యునరేషన్ వివరాలివిగో…

arun kanna

తెనాలి టీడీపీ అభ్యర్ది ఇంట్లో మద్యం సీసాలు పెట్టిన దుండగులు

Siva Prasad