Aditi Rao Hydari: అదితి రావు హైదరీ ఎన్ని సినిమాలు చేసినా టాలీవుడ్‌లో అందుకే స్టార్ హీరోయిన్ కావడం లేదా..?

Share

Aditi Rao Hydari: అదితి రావు హైదరీ..బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్. ఒకవైపు కథా బలమున్న సినిమాలు చేస్తూనే మరొకవైపు గ్లామర్ పాత్రలోను ఎంచుకొని స్టార్ స్టేటస్ దక్కించుకుంది. పర్ఫార్మెన్స్ పరంగా అదితి రావు హైదరికీ హిందీ సీమలో బాగా క్రేజ్ ఉంది. ఈమె తెలుగు కంటే ఎక్కువగా హిందీ, తమిళ సినిమాలలో బాగా అవకాశాలు అందుకుంది. అదితి రావు హైదరీ 2006లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి సరసన.. మలయాళ మూవీ’ప్రజాపతి’ తో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో అదితి దేవదాసీ పాత్రలో నటించింది. ఈ పాత్ర ఆమెకు బాగా గుర్తింపు తీసుకు వచ్చి అటు ప్రేక్షకుల, ఇటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.

is-aditi-rao-hydari-unable-to-become-star-heroine-in-tollywood
is-aditi-rao-hydari-unable-to-become-star-heroine-in-tollywood

ఇక ఆ తర్వాత ఏడాది తమిళంలో శృంగారం అనే సినిమాలో డ్యూయల్ రోల్ పోషించింది. ఈ సినిమాతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన అదితి బాగానే పేరు తెచ్చుకుంది. 2009లో ఢీల్లీ 6, 2010లో దోభీ ఘాట్ సినిమాలు చేసి బాలీవుడ్‌లో బాగా గుర్తింపు తెచ్చుకుంది. యే సాలీ జిందగీ అనే సినిమా అదితికి హిందీ ఇండస్ట్రీలో మంచి క్రేజీ హీరోయిన్‌గా మార్చేసింది. ఈ సినిమాకి ఆమె బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్‌గా అవార్డ్ అందుకుంది. ఈ సినిమా తర్వాత హిందీలో వరుసగా అవకాశాలు అందుకుంటూ వచ్చింది.

Aditi Rao Hydari: సంజయ్ దత్ కూతురుగా నటించిన ‘భూమి’ సినిమా అదితి కెరీర్‌లో బెస్ట్ మూవీ అని చెప్పాలి.

2014 వరకు అదితి 5 హిందీ సినిమాలు చేసింది. రాక్ స్టార్, లండన్..ప్యారీస్..న్యూయార్క్, మర్డర్, బాస్, ఖూబ్‌సూరత్ సినిమాలలో నటించిన అదితి..తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ సినిమాలతో హిందీలో యూత్ ఎంటర్‌టైనర్ సినిమాలకి బెస్ట్ ఛాయిస్‌గా మారింది. ఇక మరాఠీ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టింది అదితి. ఇక హిందీలో వాజీర్, ఫితూర్, గుడ్డు రంగీలా, వంటి సినిమాలు ఆమెకి మరింత క్రేజ్‌ను తీసుకువచ్చాయి. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూతురుగా నటించిన ‘భూమి’ సినిమా అదితి కెరీర్‌లో బెస్ట్ మూవీ అని చెప్పాలి.

ఇక దేవదాస్, పద్మావత్ సినిమాలలో మంచి పాత్రలు పోషించింది. ఇదే క్రమంలో టాలీవుడ్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సమ్మోహనం సినిమాలో అవకాశం అందుకుంది. సుధీర్ బాబుకు జంటగా నటించిన ఈ సినిమా అదితికి చాలా మంచి పేరు తీసుకు వచ్చింది. అంతేకాదు సైమా, ఫిల్మ్ ఫేర్ అవార్డులకి నామినేట్ అయింది. సమ్మోహనం సినిమాతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న అదితి రావు హైదరీ, మేకర్స్‌ను బాగా అట్రాక్ట్ చేసింది. ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ నటించిన అంతరిక్షం 9000 సినిమాలో హీరోయిన్‌గా నటించింది.

Aditi Rao Hydari: అదితి రావు హైదరీకి తెలుగులో స్టార్ హీరోయిన్ అనే క్రేజ్ మాత్రం రావడం లేదు.

అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయినా మరోసారి తనని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఇంద్రగంటి మోహన కృష్ణ మరోసారి వి సినిమాలో నాని సరసన నటించే అవకాశం కల్పించాడు. ఈ సినిమా కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అదితికి పర్ఫార్మెన్స్ పరంగా మంచి పేరు అయితే దక్కుతుంది గానీ తెలుగులో స్టార్ హీరోయిన్ అనే క్రేజ్ మాత్రం రావడం లేదు. దానికోసం అమ్మడు చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నాలు ఇప్పుడు నటిస్తున్న మహా సముద్రం సినిమాతో ఫలిస్తాయని చాలా నమ్మకంగా ఉంది. ఆర్.ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఈ నెల 15న రిలీజ్ కానుంది. శర్వానంద్, సిద్దార్థ్ హీరోలు. అనూ ఇమ్మానియేల్ హీరోయిన్‌గా నటిస్తోంది. చూడాలి మరి ఈ సినిమాతోనైనా అదితి రావు హైదరీకి స్టార్ స్టేటస్ దక్కుతుందా లేదా..!

 

 


Share

Related posts

Beet Root: ఇంట్లోనే బీట్ రూట్ మొక్కలను ఎలా పెంచుకోవాలో 10 సింపుల్ స్టెప్స్ లో చూపించిన స్వాతి

arun kanna

`ఎన్‌.జి.కె` ట్రైల‌ర్‌

Siva Prasad

ఓడిపోయామని వెనకడుగు వేసే ప్రసక్తి లేదు అంటున్న పవన్..!!

sekhar