న్యూస్

Indian Idol: ‘ఆహా’ ఇండియన్ ఐడల్ షో సజావుగా సాగుతుందా? వారి ఎక్సట్రాలేమిటి!

Share

Indian Idol: ఇండియన్ ఐడల్ షో గురించి తెలియని భారతీయులుండరనే చెప్పుకోవాలి. ఆ షో ద్వారా ఎంతోమంది ప్రతిభావంతులైన సింగర్స్ బయటకి వచ్చారు. ఒకప్పుడు ఇది బాలీవుడ్ కే పరిమితమైన షో. అలాంటి షోని మన తెలుగు నిర్మాత అల్లు అరవింద్ తన OTT ప్లాట్ ఫామ్ అయినటువంటి ఆహా ద్వారా తెలుగు వాళ్ళకి పరిచయం చేసారు. ఇది కూడా సక్సెస్ ఫుల్ గా రాణిస్తోంది. పైగా OTTలో తెలుగు ప్రేక్షకుల ముందుకు ఇలాంటి షో రావడం ఇదే ప్రథమం. ఆహా కు ఉన్న ఆధరణ నేపథ్యంలో ఈ షో కు కూడా మంచి ఆదరణ లభించింది. టీవీల్లో చూసినట్లుగానే ఈ సింగింగ్ కాంపిటీషన్ ను జనాలు తెగ చూస్తున్నారు.

Is 'Aha' Indian Idol show going smoothly? What are their extras!
Is ‘Aha’ Indian Idol show going smoothly? What are their extras!

ఈ డ్రామాలు అవసరమా?

ఈ తెలుగు ఇండియన్ ఐడల్ మొదటి సీజన్ కు జడ్జ్ లుగా థమన్, నిత్యా మీనన్ మరియు సింగర్ కార్తీక్ లు వ్యవహరిస్తున్న విషయం అందరికీ తెల్సిందే. అయితే ఈ షోలో పాటలతో పాటు కాస్త డ్రామా కూడా ఎక్కువే ఉంటుంది. అయితే బేసిగ్గా ఇలాంటి డ్రామాలు యాడ్ చేస్తేనే ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తారు. కేవలం పాటలు ఉంటే జనాలు ఆసక్తి చూపించరు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమంలో కూడా కాస్త డ్రామాను యాడ్ చేసి పాటకు పాటకు మద్య కాస్త ఫన్నీ వాతావరణంను సృష్టిస్తున్నారు నిర్వాహకులు. హీరోయిన్ నిత్యా మీనన్ చిలిపి ముచ్చట్లు, యాంకర్ శ్రీరామ చంద్ర మరియు సింగర్ కార్తీక్ ల సరదా సంభాషణ ఇలా సాగిపోతుంది.

Is 'Aha' Indian Idol show going smoothly? What are their extras!
Is ‘Aha’ Indian Idol show going smoothly? What are their extras!

తాజాగా జరిగింది ఇదే

తాజాగా మారుతి అనే కంటెస్టెంట్ డబుల్ ధమాకా స్పెషల్ లో భాగంగా ‘ఏవండోయ్ నాని గారు’ పాట పాడుతున్న సమయంలో పెద్ద రచ్చే జరిగింది. ఇక్కడున్న ఇద్దరు కూడా జడ్జ్ మెంట్స్ అయినటువంటి నిత్యా, థమన్ కూడా ఒకరి అభిప్రాయంతో మరొకరు విభేదించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో వారి మధ్య సీరియస్ గానే వాగ్వాదం జరిగిందనే సమాచారం టీమ్ నుండి వినిపిస్తుంది. స్క్రిప్ట్ ప్రకారం జరిగినా కూడా ఒకింత బోర్డర్ దాటిందని అంటున్నారు. ఇక ఈ గొడవ సందర్బంగా మరో జడ్జ్ అయిన కార్తిక్ మొదట నిత్యా మనన్ కు మద్దతుగా నిలిచాడట. కొంత చర్చ జరిగిన తర్వాత ఆయన థమన్ వైపు మళ్లాడట. అయితే ఇది నిజామా కాదా అన్నది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.


Share

Related posts

ఆ రైల్వే స్టేషన్ కి ఎప్పుడైనా వెళ్ళారా? దయ్యాలు చూడాలి అంటే వెళ్ళండి !

Naina

ఆ పోస్టు మాకు వద్దే వద్దు సార్ ! చంద్రబాబు, జగన్ లకు ముఖం మీదే చెప్పేస్తున్న నాయకులు!!

Yandamuri

కావాలని కరోనా వైరస్ అంటించుకొని.. లక్షలు సంపాదిస్తున్న విద్యార్థులు

Varun G